శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (13:35 IST)

మహాభారతం టు 2898AD కథే కల్కి : నాగ్ అశ్విన్ లేటెస్ట్ అప్ డేట్

2898AD Kalki Art director kriation
2898AD Kalki Art director kriation
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ జరుగున్న సంగతి తెలిసిందే. ఇది హాలీవుడ్ లోని సైంటిఫిక్ మూవీకి స్పూర్తి అని కామెంట్లు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు ఓ ఆంగ్ల ప్రతికకు ఇచ్చిన ఇంటర్వూలో పాయింట్ రిలీవ్ చేసేశారు.  ‘మా సినిమా మహాభారతంలో మొదలై 2898ADలో ముగుస్తుంది. మొత్తం 6వేల సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తాం. ఈ సినిమా కోసం భారీ సెట్స్, వాహనాలను డిజైన్ చేస్తున్నాం. మే 9న కల్కి రిలీజ్ అవుతుంది’ అన్నారు.
 
మహాభారతం పాత్రలు కనుక  పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పాన్ వరల్డ్ సినిమాగా పాన్ వరల్డ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఇదే అవుతుందని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.