శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (18:58 IST)

మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్

Pradeep Machiraju, Deepika Pilli
Pradeep Machiraju, Deepika Pilli
యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు తన సెకండ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తో అలరించబోతున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పిల్లి ప్రదీప్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్  మోషన్ వీడియోకు  మంచి స్పందన వచ్చింది.
 
మేకర్స్ ఫస్ట్ సింగిల్ లే లే లే లే లే విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. రధన్ స్కోర్ చేసిన ఈ మెస్మరైజింగ్ నంబర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. ప్రదీప్ ఫస్ట్ సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లోని 'నీలి నీలి ఆకాశం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో  తెలిసిందే. అదేవిధంగా, లే లే లే లే కూడా వైరల్ సంచలనంగా మారడానికి అన్ని ఎలిమెంట్స్ ని కలిగి ఉంది.
 
రధన్ కంపోజ్ చేసిన అద్భుతమైన మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది, పాటకు డెప్త్ జోడించింది. కొంత గ్యాప్ తర్వాత  ఉదిత్ నారాయణ్ తన మెస్మరైజ్ చేసే వాయిస్ ని తెలుగు ట్రాక్‌కి అందించారు, ఇది పాటకు అదనపు ఆకర్షణను తీసుకువచ్చింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని అందంగా ప్రజెంట్ చేసే రొమాంటిక్ నంబర్‌కు శ్రీధర్ ఆవునూరి లిరిక్స్  అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ప్రదీప్, దీపికా పిల్లి బ్యూటీఫుల్ డ్యాన్సింగ్ మూవ్స్ తో మెస్మరైజ్  చేశారు.
 
బ్లైండ్‌ఫోల్డ్ గేమ్ ద్వారా చిత్రీకరించబడిన ప్రేమకథ ఒక యూనిక్, క్రియేటివ్ కాన్సెప్ట్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, అద్భుతమైన గ్రామీణ నేపథ్యంలో అందంగా షూట్ చేసిన ఈ సాంగ్ రొమాంటిక్ చార్మ్ ని మరింతగా పెంచింది.  
 
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.