శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (10:17 IST)

అలిపిరి నడక మార్గంలో మహేశ్ బాబు ఫ్యామిలీ.. (video)

Mahesh Babu Family
Mahesh Babu Family
ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలలోని సుధాకృష్ణ నిలయం అతిధి గృహంలో బస చేసిన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో మహేష్ బాబు ఫ్యామిలీ.. @urstrulyMahesh #NamrataShirodkar #Tirumala #AndhraPradesh #RTV pic.twitter.com/b26mrYZD3u
బుధవారం అలిపిరి నడక మార్గంలో మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార.. తిరుమలకు చేరుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. 
 
ముందుగా సమ్రత శిరోద్కర్ నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి నడక మార్గంలో స్వామి వారి దర్శనానికి బయలుదేరారు. మహేశ్ బాబు కుటుంబ సభ్యుల వెంట అభిమానులు కూడా నడిచారు. 
 
వీరు నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ కొండపైకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.