1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మార్చి 2025 (13:16 IST)

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Malavika Mohanan latest dress
మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రముఖ హీరోయిన్ మాళవికా మోహనన్ అన్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర "రాజాసాబ్". త్వరలోనే విడుదలకానుంది. ఇందులో హీరోయిన్‌గా మాళవికా మోహన్ నటించారు. ఈ చిత్రంలో అవకాశం రావడంపై స్పందిస్తూ, ప్రభాస్ మంచితనం, సహృదయతకు ఫిదా అయిపోయానని చెప్పింది. ప్రభాస్ వంటి గొప్ప వ్యక్తితో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. 
 
ఈ సినిమాలో ఛాన్స్ రావడాన్ని లక్కీగా భావిస్తున్నానని, ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మించిన ఆనందం ఏముంటుందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. మరోవైపు, హారర్ కామెడీ థ్రిల్లర్‌గా "ది రాజా సాబ్" తెరకెక్కుతోంది.