శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్
Manchu Manoj, Bhumamaunika with Shivaraj Kumar
మిరాయ్ చిత్ర బ్రహ్మాండ విజయం తర్వాత మంచు మనోజ్ పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యకు వెళ్లి.. శ్రీరాముడిని దర్శించుకున్నారు. అయోధ్య నుంచే మిరాయ్ సినిమా సక్సెస్ టూర్ ను ప్రారంభిస్తున్నట్లు మనోజ్ వెల్లడించారు. మొదట హనుమాన్ గఢీని దర్శించి పూజలు చేసిన మంచు మనోజ్...ఆ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ - అయోధ్య రావాలనేది నా కల. ఇప్పుడు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. అమవాస్య రోజు దర్శనం మంచిదని స్వామిజీలు చెప్పారు. శ్రీరాముడు యుద్ధంలో గెలిచి ఇక్కడికి వచ్చాడు. మేము కూడా సినిమా యుద్ధంలో గెలిచి విజయం సాధించి ఈ పుణ్యక్షేత్రం రావడం సంతోషంగా ఉంది. దర్శనం అద్భుతంగా జరిగింది. మరోసారి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వస్తాను. మీరంతా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నా. రామాయణ ఇతిహాసం స్ఫూర్తి మా మిరాయ్ మూవీ కథలో ఉంది. ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ పాత్రలో నటించాను. అశోకుడు 9 గ్రంథాల్లో రాసిన రహస్యాలు తెలుసుకుని బ్లాక్ స్వార్డ్ శ్రీరాముడిని ఎదుర్కొనే రావణుడిగా మారతాడు. ఈ పాత్రలో నటించినందుకు శ్రీరాముడికి క్షమాపణలు చెప్పుకున్నా. మా మిరాయ్ సినిమా సక్సెస్ టూర్ అయోధ్య నుంచే ప్రారంభమవుతోంది. శ్రీరాముడి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
అనంతరం బెంగుళూరులో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ నిమ్మశివన్న, అతని కుటుంబాన్ని కలుసుకున్నారు, అతని భార్య భూమామౌనిక తో కలిసి సందర్శించారు. అయితే ఈ కలయిక మంచి ఎనర్జీ ఇచ్చిందని మనోజ్ పేర్కొన్నారు. శివరాజ్ కుమార్ కుటుంబంతో కలవడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మరి కన్నడలోనూ మరోజ్ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.