శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (18:16 IST)

కుమార్తె ప్రేమించింది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటుడు ప్రభు

Aishwarya
Aishwarya
ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె వివాహం త్వరలో జరుగనుంది. డార్లింగ్, చంద్రముఖి, తూనీగా తూనీగా, మిస్టర్ ప్రేమికుడు, నేనే వస్తున్నా వంటి సినిమాల్లో తండ్రి పాత్ర పోషించిన ప్రభు.. కేవలం తెలుగు, తమిళ్ లోనే కాకుండా మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేశాడు. 
 
ప్రస్తుతం హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్న ప్రభు కుమార్తె ఐశ్వర్యా ప్రభు త్వరలో పెళ్లి చేసుకోనుంది. కానీ ఆమెకిది రెండో పెళ్లి. ఐశ్వర్యా ప్రభుకు గతంలోనే ఓసారి వివాహం జరిగింది. తమ దగ్గరి బంధువు అయిన కునాల్ అనే వ్యక్తితో 2009లో వైభవంగా పెళ్లి జరిపించాడు. ఆపై భర్తతో పాటు అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడినా.. విబేధాల కారణంగా విడాకులు తీసుకుంది. 
 
ఆ తర్వాత భారత్‌లో వుండిపోయిన ఐశ్వర్యా.. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో పీకల్లోతు ప్రేమలో వున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి ప్రేమ గురించి ఐశ్వర్య ఇంట్లో కూడా చెప్పి ఒప్పించిందట. ఈక్రమంలోనే త్వరలోనే వీరిద్దరి పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కూతురు ప్రేమ విషయం తెలుసుకున్న ప్రభు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.