శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (18:13 IST)

మాస్ మహరాజా రవితేజకు గాయాలు శస్త్ర చికిత్స

Ravi teja
Ravi teja
మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత తాజాగా రవితేజ నూతన చిత్రం ఆర్. టి. 75 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారంనాడు ఎడమచేతికి తీవ్ర గాయాలయ్యాయి. దానితో వెంటనే ఆసుప్రతికి తీసుకెళ్ళగా చిన్నపాటి శస్త్ర చికిత్స జరిపారని తెలిసింది. కనీసం రెండువారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు తెలిపారు. 
 
ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజకు గాయాలు అని తెలియగానే సోషల్ మీడియాలో ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని వాంఛిస్తున్నారు. ఇటీవలే ఆయన చేసిన మిస్టర్ బచ్చన్ కమర్షియల్ గా పెద్దగా లాభించలేదు. ఫలితం సంభంధం లేకుండా ఆయనకు మరో రెండు సినిమాలు లైన్ లో వున్నాయి.