Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి
Chiranjeevi, R.Narayanamurthy
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న జరిగిన బాలక్రిష్ణ, కామినేని ప్రశ్న సమాధానాల అనంతరం చిరంజీవి వెంటనే స్పందించారు. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు చిరంజీవితోపాటు ఆర్. నారాయణ మూర్తి కూడా వెళ్ళారు. ఈ విషయాలను ఆయన ముందుంచగా జరిగింది ఏమిటో ఇలా తెలియజేశారు.
చిరంజీవిగారు చెప్పింది సత్యం. అప్పట్లో పేర్ని నాని సినిమా మంత్రిగా వున్నారు. పరిశ్రమలో పెద్దలతోపాటు నన్ను కూడా పిలిచారు. అప్పడు ఏం జరిగిందంటే. జగన్ ప్రభుత్వం చిరంజీవితోపాటు ఎవరినీ అవమానించలేదు. గౌరవించారు. కోవిడ్ టైంలో సినిమా ఏమవుతోందని భయంతో పరిశ్రమ పెద్దలు జగన్ ను కలిశారు. చిరంజీవి గారు ఫోన్ చేశారు. అప్పుడు నేను ఢిల్లీలో వున్నాను. సగటు సినిమాలు తీసే మీరు కూడా రావాలని అని కోరారు. దానితో చిరంజీవి గారి ఇంటిలో మీటింగ్ జరిగింది.
ఆ తర్వాత బందరు నేను కూడా పేర్ని నాని గారిని కలిసి సమస్యలు విన్నవించాను. జగన్ దగ్గరకు వెళ్ళి సమస్యలు చెప్పాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఏది కావాలో అవి నెరవేరుద్దామని జగన్ చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. అయినా అప్పటి సమస్యలు పరిష్కారం కాలేదు. కనుక గత విన్నపాలను చంద్రబాబు ప్రభుత్వం సాల్వ్ చేయాలని, దుర్గేష్, పవన్ కళ్యాణ్ గారు కూడా పరిశ్రమ సమస్యలు నివ్రత్తి చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.