గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (18:37 IST)

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్ - షూటింగ్ స్పాట్ నుంచే టీజర్ విడుదల

Vishwambhara  Teaser poster
Vishwambhara Teaser poster
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష నాయికగా నటిస్తోంది. తాజాగా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్లో సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకు ఇద్దరు కొరియోగ్రాఫర్లు పనిచేయడం విశేషం. చిరంజీవి రెండు రోజులుగా సాంగ్ చిత్రీకరణలో వున్నారు. కాగా దసరాకు సినిమా అప్ డేట్ గురించి చిత్ర యూనిట్ తెలియజేసింది. రేపు శనివారంనాడు 10.49 నిముషాలకు విశ్వంభర టీజర్ విడుదలచేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేసింది. 
 
చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. విశ్వంభర విశ్వం దాటి మెగా మాస్ అవుతుందని ప్రకటన కూడా చిత్ర యూనిట్ చేసింది. ఇది విశ్వంలోని అద్భుత శక్తి నేపథ్యంలో దర్శకుడు కథను రాసుకున్నాడు. చిరంజీవి దివ్యశక్తులు వుంటే ఎలా వుంటుందనే కోణంలో కథ వుంటుందని తెలుస్తోంది. ఆవిషారంగనాథ్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఛోటాకె.నాయుడు సినిమాటో గ్రఫీ సమకూరుస్తుండగా, కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ బేనర్ లో చిత్రం రూపొందుతోంది.