సోమవారం, 10 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శనివారం, 8 మార్చి 2025 (10:37 IST)

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

Chiranjeevi, Khushboo, Surekha, Radhika, Jayasudha and others
Chiranjeevi, Khushboo, Surekha, Radhika, Jayasudha and others
నేడు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ  మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో హీరోయిన్స్, సురేఖ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.  నా నిజ జీవితాన్ని,  నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు అని తెలిపారు.
 
కాగా, ప్రస్తుతం విశ్వం భర సినిమాను చిరంజీవి చేస్తున్నారు. అనంతరం  దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేయనున్చేనారు. త్వరలో పట్టా లెక్కుతుందని దర్శకుడు ఇటివలే వెల్లడించారు.  ఈ సినిమాతో మెగాస్టార్ కామెడీ జోనర్‌ను మనముందుకు తీసుకురాబోతున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్స్ తర్వాత అనిల్ చేస్తున్న సినిమా ఇది.  ప్రస్తుతం వైజాగ్‌లో అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని తెలిసింది. మే నెలలో ముందుగా సాంగ్ షూట్ చేసి జూన్ నెలలో తాకి  స్టార్ట్ చేయాలని అనిల్ రావిపూడి మెగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.