శుక్రవారం, 8 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (18:18 IST)

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

Parada melody song
Parada melody song
అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది. ఎగరేయ్ నీ రెక్కలే... కలిపే ఆ దిక్కులే.. అంటూ వనమాలి రాసిన  పరదా చిత్రంలోని మూడో సాంగ్ చక్కటి మెలోడీగా వుంది. నేడే విడుదలైన ఈ సాంగ్ ను రితేష్ రావ్ తన గాత్రంతో మైమరిపించారు. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సినిమాకు గోపీ సుందర్ చక్కటి సంగీతాన్ని సమకూర్చారు. 
 
సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
గోపి సుందర్ అద్భుతంగా స్వరపరిచిన యత్ర నార్యస్తు మహిళల బలం, దైవత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ట్రాక్. మహిళల శక్తిని, పవిత్రతను స్ఫూర్తిదాయకంగా చూపిస్తూ.. దైవత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది. వినిపించే ప్రతి లైన్ వెనక ఓ బలమైన భావం వుంది. వనమాలి రాసిన అర్థవంతమైన పదాలు, అనురాగ్ కులకర్ణి వోకల్స్.. పాటను భావోద్వేగాలతో నింపేస్తాయి.