బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (23:19 IST)

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi
పద్మవిభూషణ్ చిరంజీవి తన రాజకీయ జీవితం గురించి సంచలన ప్రకటన చేసారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటానంటూ ప్రకటించారు. బ్రహ్మఆనందం చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
 
''చాలామంది ఇటీవల నేనేదో రాజకీయాలకు దగ్గరవుతున్నట్లు మాట్లాడుకుంటున్నారు. అందులో వాస్తవం లేదు. నేను నా జన్మంతా ఇక రాజకీయాలకు దూరంగా వుంటాను. కళామతల్లిని అక్కున చేర్చుకుంటూ సేవ చేసుకుంటాను. రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే నా లక్ష్యాన్ని, ఆశయాలను నా తమ్ముడు పవన్ కల్యాణ్ తీర్చుతున్నాడు. కనుక ఇక నేను రాజకీయాల్లోకి రానవసరంలేదు. ఈ జీవితమంతా సినిమాలకే కేటాయిస్తాను'' అని చెప్పారు.