శుక్రవారం, 5 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 3 సెప్టెంబరు 2025 (15:20 IST)

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran
Anupama Parameswaran
తనకు చిన్నప్పటినుంచి దెయ్యం సినిమాలంటే ఇష్టం. వాటినే చూస్తుండేదానిని. అమ్మకు విసుగుపుట్టి నువ్వు దెయ్యంలా వుంటావే అంటూ తిడుతుండేవి. ఇప్పుడు అటువంటి దెయ్యం పాత్రతో చేసిన కిష్కిందపురి లో ఛాన్స్ రావడం థ్రిల్ కలిగించిందని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ అన్నారు. నా జుట్టు తోపా నా భాష కూడా ఇంట్లో భిన్నంగా మాట్లాడుతూ అమ్మను ఏడిపించేదానిని అంటూ గతాన్ని నెమరేసుకున్నారు. 
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం కిష్కిందపురి. ఈ చిత్రం ట్రైలర్ విడుదల  బుధవారంనాడు హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐమాక్స్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి కథ చెప్పినప్పుడు ఏమీ అర్థంకాలేదు. కానీ తను చెప్పిన విధానం అద్భుతంగా వుంది. దానికి నేను కనెక్ట్ అయ్యాను. పైగా నాకిష్టమైన దెయ్యం కథలలో నటించాలని ఎప్పటినుంచో అనుకున్నా. ఇంతకుముందు కొన్ని కథలు వచ్చినా ఏదీ నన్ను ఇన్ స్పైర్ చేయలేదు. అయితే ఈ సినిమా డబ్బింగ్ లో దర్శకుడు నాకు టార్చర్ చూపించాడు అని అన్నారు.
 
నిర్మాత సాహు గారపాటి గారితో ముందు ఓ సినిమా చేశాను. హీరో సాయి తో రాక్షసుడు సినిమా చేశాను. చాలా మెమొరబుల్ సినిమా. ఇది డిఫరెంట్ మూవీ. ఈ సినిమాను ఈనెల 12న థియేటర్లో చూసి ఆనందించండి అని తెలిపారు. చైతన్‌ భరద్వాజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చేశారు.