శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (13:01 IST)

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

Srileela
Srileela
పెళ్లిసందడి సినిమాలో నటిగా కెరీర్ ఆరంభించిన శ్రీలీల ఇప్పుడు అగ్ర హీరోల సరసన నాయికగా చేసేస్థాయికి ఎదిగింది. కెరీర్ పీక్ లో వుండగానే ఐటెంట్ సాంగ్ కూడా చేసేసింది. పుష్ప 2 సినిమాలో ఐటెంసాంగ్ చేసింది. తాజాగా నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమాలో నాయికగా నటించింది. ఈ చిత్రం టీజర్ విడుదల సందర్భంగా ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 
 
రాబిన్ హుడ్ సినిమాకు ముందుగా శ్రద్దాకపూర్ ను అనుకున్నారు? మీకు ఆ పాత్ర రావడం ఎలా అనిపించింది?
నాకు ముందు ఎవరిని అనుకున్నారో నాకు తెలీదు. నా దగ్గరకు కథ వచ్చాక నాపై వున్న నమ్మకంతో వారు వచ్చారు. కథ బాగుంది కాబట్టి నేను అంగీకరించాను.
 
కెరీర్ పీక్ లో వుండగానే పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయడం కరెక్టే అనిపించిందా?
నేను మంచి సినిమాలో చేస్తున్నాను. ఐటెంగ్ చేయడం అనేది నటిగా నాకున్న పరిమితి మేరకు. అందులో నేను ఎందుకు నటించానేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కథలో భాగంగానే ఆ పాట వస్తుంది.
 
మీరు డాన్స్ క్వీన్ గా పబ్లిసిటీలో ప్రచారం చేస్తున్నారు? మీ ద్రుష్టిలో కింగ్ ఎవరో చెప్పగలరా?
డాన్సర్ గా నాకు అనుభవముంది. డాన్సర్ గా వుండగానే నటిగా ప్రవేశించాను. భరత నాట్యం, కూచిపూడి డాన్స్ బాగా చేయగలను. రాబిన్ హుడ్ లో కూడా నితిన్ తో కలిసి డాన్స్ చేశాను.వన్ మోర్ టైమ్‌ సాంగ్ కి మంచి స్పందన వస్తోంది. మిగిలిన పాటలు మంచి పాపులర్ అయ్యాయి. అయితే నా ద్రుష్టిలో డాన్స్ కింగ్ అంటే అల్లు అర్జున్.
 
నటిగా ఈమధ్య గేప్ తీసుకోవడానికి కారణం?
నటిగా అవకాశాలున్నప్పుడు చేస్తూనే వున్నాను. దానికంటే ముందుగా నేను డాక్టర్ కోర్సు అభ్యసిస్తున్నాను. పరీక్షల సమయంలో దానిపై కాన్ సన్ ట్రేషన్ చేయాలి. అందుకే సమయం చూసుకుని నటిగా చేస్తున్నాను.
 
కథానాయికగా రెమ్యునరేషన్ హైలో వుంటుంది కదా.. మరి ఐటెం సాంగ్ కు ఎంత తీసుకున్నారో తెలుసుకోవచ్చా?
పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయాలని అనగానే నిర్మాత రవిగారితో ఆ పాట గురించే చర్చ చేశాం. కానీ పారితోషికం గురించి అస్సలు మాట్లాడలేదు. ఎంత ఇస్తారనేది వారికే వదిలేశాను. ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా కూడా వారి నిర్మాణంలో జరుగుతుంది. మరో సినిమా కూడా వారి బేనర్ లో వుంది. కానీ ఇంకా పూర్తి చర్చలు జరగలేదు. నా చదువు ద్రుష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేస్తాను అన్నారు.
 
నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ 'రాబిన్‌హుడ్' నుంచి జివి ప్రకాష్ కుమార్ కంపోజింగ్ లో పాప్ క్వీన్ విద్యా వోక్స్ పాడిన వన్ మోర్ టైమ్‌ సాంగ్ మిలియన్ వ్యూస్ చేరుకుంది. డిసెంబర్  25న సినిమా విడుదలకాబోతోంది.