సోమవారం, 10 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 జనవరి 2025 (11:57 IST)

NBK happy - ఆనంద వేడుకల్లో డాకు మహారాజ్ - USAలో $1M+ గ్రాస్‌ని దాటింది

Thaman, anil ravipudi, Vijay Karthik
Thaman, anil ravipudi, Vijay Karthik
నిన్న విడుదలైన మొదటి షో నుంచి 'డాకు మహారాజ్' చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శక నిర్మాతలు. గ్రాండ్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్‌ల కోసం ఒక భారీ బ్లాక్‌బస్టర్ పిలుపునిచ్చింది. నిన్న రాత్రే దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు థమన్, సినిమాటోగ్రాఫర్ లు ఓ వేడుకలో పాల్గొన్న ఫొటోను షేర్ చేశారు. డాకు మహారాజ్ మాయాజాలంలో ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్ తో తమ ఆనందాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.
 
USA report
USA report
ఒక ఓవర్ సీస్ మార్కెట్ కూడా బాగానే వుంది. USAలో $1M+ గ్రాస్‌ని దాటింది. దాని బ్లాక్‌బస్టర్ హంటింగ్ స్ప్రీని కొనసాగిస్తోంది.ఇది NBK తుఫాను ప్రారంభం మాత్రమే అంటూ చిత్ర టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టర్ విడుదల చేసింది. పంపిణీదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ShlokaEnts ద్వారా USA విడుదల కాగా, Radhakrishnaen9 ద్వారా ఓవర్సీస్ విడుదలయింది. 
 
సక్సెస్ జోరులో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, అనంతపురంలో 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ అక్కడ చేయాలని అనుకున్నా తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు చనిపోవడంతో వాయిదా వేయాల్సివచ్చింది.
 
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, "తెలుగు ప్రేక్షకులు అందరికీ పేరు పేరునా మా టీం తరపున థాంక్స్ చెబుతున్నాము. రెండేళ్ళ క్రితం ఒక ఆలోచనతో ఈ ప్రయాణం, ఈ సంక్రాంతి కానుకగా మీ ముందుకు వచ్చింది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాము. సినిమాకి వస్తున్న స్పందన పట్ల బాలకృష్ణ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. నా ఈ అవకాశం ఇచ్చి, ఫ్రీడమ్ ఇచ్చి, అడిగివన్నీ సమకూర్చి, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నాగవంశీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.