శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (14:17 IST)

ఐమాక్స్ లో పుష్ప2కు నో బుకింగ్ - మరి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

Prasad lab Theater door damage
Prasad lab Theater door damage
ఏ సినిమా రిలీజ్ అయినా ముందుగా మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్ ఐమాక్స్ లో ప్రదర్శనకు నోచుకుంటాయి. చిన్న సినిమా కూడా అక్కడ ఆడుతుంది. కానీ పుష్ప 2 విషయంలో మాత్రం అస్సలు టికెట్ల బుకింగే లేదు. ఆరు థియేటర్లలో ఒకే సినిమాను వేసిన సందర్భాలు చాలా వున్నాయి. ఆమధ్య దేవర సినిమా కూడా రిలీజ్ అయి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. కానీ ప్రసాద్ ఐమాక్స్ లో మాత్రం పుష్ప 2 ప్రదర్శించడానికి యాజమాన్యం ఉత్సుకత చూపించలేదు.

అందుకు అంతర్లీనంగా చిత్ర నిర్మాతల మధ్య ఏదో చిన్నపాటి ఒప్పందం బెడిసికొట్టిందనే వార్త మాత్రం ఫిలింనగర్ లో వినిపిస్తోంది. కానీ ఇవేవీ తెలియని ఫ్యాన్స్ మాత్రం ఓ ఘోరాన్ని చేశారనే చెప్పాలి. అందుకే ఐమాక్స్ యాజమాన్యం ఓ పోస్ట్ ను పెట్టింది.
 
ఆ పోస్ట్ లో.. ” మా విలువైన పార్ట్నర్ కి..గత రెండు దశాబ్దాలుగా, సినీ ప్రేక్షకులకు మంచి సినిమా అనుభూతిని అందిస్తున్నాము. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తూ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మేము మీకు ఇష్టమైన ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో పుష్ప 2 సినిమాని ప్రదర్శించలేకపోయాము. దీని వల్ల మీకు ఏదైనా అసౌకర్యాన్ని కలిగించి ఉంటే క్షమించండి. మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అంటూ తెలిపారు.
 
అయితే ఇది పట్టించుకోని అభిమానులు మాత్రం గుర్తిండిపోయేలా ఓ పనిచేశారు. బుధవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో షోను వేశారు. అక్కడ పోటెత్తిన అభిమానులు కానీ, మరెవరైనా కానీ థియేటర్ డోర్ లను విరగొట్టేశారు. థియేటర్ ఎంట్రన్స్ మెట్లను కూల్చేశారు. ఇది ఎవరు చేశారనేది పక్కన పెడితే ఐమాక్స్ లో సినిమా వేయకపోవడం వల్ల ఇలా జరిగిందనే మాత్రం తేటతెల్లమవుతోంది.