గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2025 (16:34 IST)

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం 3వేల మందితో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ

Prashanth neel guides action sean
Prashanth neel guides action sean
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమా నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే.  3వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ వచ్చే షెడ్యూల్ నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ  భారీ పాన్ ఇండియా చిత్రం జనవరి 9, 2026లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది.

ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూడసాగారు. ఆ సమయం రానే వచ్చేసింది. రానున్న సంక్రాంతి థియేటర్స్‌కు ఈ చిత్రం సరికొత్త పండుగను తీసుకొస్తుందనటంలో సందేహం లేదు.
 
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటే బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్.. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని సరికొత్త మాస్ విజన్‌తో ఆవిష్కరించనున్నారు. ఇప్పటి వరకు తారక్‌ను చూడనటువంటి మాస్ అవతార్‌లో ప్రెజంట్ చేయనున్నారు. దీంతో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుందనటంలో సందేహం లేదు. ప్రెస్జీజియస్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనున్నారు.
 
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చలపతి ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.