Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?
నటి శ్రియా రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఈమె మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ గారితో కలిసి కొన్ని సన్నివేశాలలో నటించానని చెప్పింది. ఆయన చాలా తెలివైన, మర్యాద గల వ్యక్తి అని కొనియాడారు.
ఆయన ఎంతో హుందాగా నడుచుకుంటారు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఎదుటివారితో ఆయన ప్రవర్తన, మాట్లాడే విధానం చక్కగా ఉంటుందని ఈమె పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ దానయ్య నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఓజీ షూటింగ్ థాయ్‌లాండ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఈయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
పొగరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు శ్రియా రెడ్డి. కొంతకాలం తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి శ్రీయ ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో నటించారు.