శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (18:23 IST)

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

Hari hara poster
Hari hara poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించాల్సిన హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ రాజకీయ కారణాలతో వాయిదా పడింది. తాజాగా పవన్ స్టేట్ మెంట్ ఇస్తూ, హరి హర వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత తనపై వుందని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 23 నుంచి హైదరాబాద్ శివార్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేయనున్నారు. కొంత భాగాన్ని అన్న పూర్ణ స్టూడియోస్ లోనూ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆల్ రెడీ జరిగిపోయాయి. 
 
చారిత్రాత్మక నేపథ్యంలో ధీరుడి గాధ ఆదారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం  దాదాపు నాలుగేళ్ళ నుంచి షూటింగ్ దశలోనే ఉంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 5 వరకు వీరమల్లు షూటింగ్ ని కొనసాగనున్నదని తెలుస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.