గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (11:10 IST)

ప్రకాష్ రాజ్ అంటే ఇష్టం.. అపార్థం చేసుకోలేదు.. అర్థం చేసుకున్నా.. పవన్ కల్యాణ్

Prakash_Pawan
Prakash_Pawan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ల మధ్య ట్విట్టర్ యుద్ధం జరుగుతుందనే చెప్పాలి. తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంపై పవన్ చేసిన కామెంట్లపై ప్రకాష్ రాజ్ స్పందించడం పట్ల ఆయనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 
 
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌పై ట్రోల్స్ మొదలైనాయి. అయినా ప్రకాష్ రాజ్ తగ్గలేదు. పవన్‌పై వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి ముగింపు పలకాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. తాను పెట్టిన పోస్టును పవన్ అపార్థం చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ అనడంతో.. పవన్ స్పందిస్తూ.. వ్యక్తిగతంగా ప్రకాశ్ రాజ్ అంటే ఇష్టమని చెప్పారు. 
 
ఆయన తనకు మంచి మిత్రుడని పవన్ అన్నారు. రాజకీయాల పరంగా తమ మధ్య భిన్నాభిప్రాయాలున్నా.. ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం వుందని పవన్ చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే పోస్టు పెట్టానని చెప్పారు. 
 
ప్రకాశ్ రాజ్‌తో కలిసి పనిచేయడం.. ఆయనంటే ఎంతో ఇష్టం.. ఆయన చేసిన పోస్టును తప్పుగా అర్థం చేసుకోలేదు. ఇంకా ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైందని పవన్ స్పష్టం చేశారు.