1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 మే 2025 (12:32 IST)

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. "మన ఊరు - మాటామంతి" పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో మాట్లాడారు. 
 
ఇందుకోసం టెక్కలిలోని భవానీ థియేటర్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. 
 
ప్రజా సమస్యలైప వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రావివలస గ్రామస్థులు తమ సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రికి తెలుపుకునే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.