మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (09:00 IST)

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

ustad bhagat singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్. ఈ చిత్రం చిత్రీకరణలో భాగంగా, తన భాగాన్ని ఆయన పూర్తిచేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సెట్స్ నుంచి ఓ ఫోటోను దర్శకుడు హరీష్ శంకర్ పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంటే, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత పవన్ - హరీశ్ శంకర్ కాంబోలో ఈ చిత్ర రానుంది. 
 
ఇటీవలే 'హరి హర వీరమల్లు'తో అభిమానుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అదే జోష్‌తో ఇప్పుడు 'ఉస్తాద్' భగత సింగ్‌ను పూర్తి చేశారు. ఆయన సపోర్ట్ వల్లే ఈ షెడ్యూల్ త్వరగా పూర్తయినట్లు హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌పై ప్రశంసలు కురిపించారు. 'మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం.. మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే' అంటూ ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. 
 
ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. పవన్ ఎనర్జీ సినిమాకు మరింత పవర్ను ఇచ్చిందన్నారు. సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం హరీశ్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పవన్ సింపుల్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు. 
 
'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ 'ఓజీ'లో నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఇది రానుంది.