శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (08:43 IST)

అజాద్ హింద్ ఫౌజ్ పేరుతో ప్రభాస్ చిత్రం- - తాజా అప్ డేట్

Prabhas, Imanvi
Prabhas, Imanvi
దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు. సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం 2025 చివర్లో విడుదల కానున్నది. కాగా, ఈ సినిమా నేపథ్యం  1940ల నాటిది. వర్కింగ్ టైటిల్ గా ఫౌజీ పేరుతో షూటింగ్ కొనసాగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే  హైదరాబాద్ లోని శంకరపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రభాస్ తో పాటు పలువురిపై షూటింగ్ చిత్రీకరించారు.
 
ఈ సినిమాలో ప్రభాస్ 1940 కాలం ఆహార్యం డ్రెస్ తో కనిపించనున్నాడు. ఇటీవలే కార్తికేయ 2 వంటి సినిమాను రూపొందించి ప్రజల్లో పురాణాల్లో నమ్మకాన్ని కలిగించేలా చేస్తున్న కథలు వస్తున్నాయి. తాజాగా ఆ తరహాలో దేశభక్తిని ప్రేరేపించే కథలు రూపొందుతోన్నాయి. ప్రభాస్ కెరీర్ ను ద్రుష్టిలో పెట్టుకుని ఇంతకుముందు ఆదిపురుష్ సినిమాకూ వచ్చింది. సైనిక నేపథ్యంతో ఆమధ్య సీతారామం తీసిన హనురాఘవపూడి ఈసారి ఫౌజీ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత భరత్ భూషణ్ సమర్పిస్తున్నారు. తెలుగులో మాత్రం మైత్రీమూవీస్ తెరముందుకు వచ్చింది. 
 
ఇక రెండురోజులనాడు హైదరాబాద్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను ప్రభాస్ చిత్రీకరించారని సమాచారం. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలపై బిజీగా వున్నాడు. ఆల్ రెడీ మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రం పూర్తయింది. విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కాాగా ఫౌజీ సినిమాలో  మిథున్ చక్రవర్తి, జయప్రదతోపాటు మలయాళ, తమిళ నటీనటులుకూడా నటించనున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమాకు విశాల్ సంగీతం సమకూరుస్తున్నారు. టీ సిరీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.