గురువారం, 13 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శనివారం, 11 అక్టోబరు 2025 (12:27 IST)

Priyanka Mohan: ఎ.ఐ. టెక్నాలజీ దుర్వినియోగంపై మండి పడ్డ ప్రియాంక మోహన్

Priyanka Mohan
Priyanka Mohan
అధునాతన టెక్నాలజీ పేరుతో ఎ.ఐ. అనేది రావడంతో ఉన్నది లేనిదీ, లేనిదీ ఉన్నది చూపిస్తూ  సెలబ్రెటీలను అవమానించడం పరిపాటి అయింది. ఎ.ఐ. ఊబిలో అమితాబ్ బచ్చన్ తోపాటు పలువురు ప్రముఖులను కూడా ఇరికించారు. తాజాగా ఓ.జి. నాయిక  ప్రియాంక మోహన్ ఇప్పుడు డార్క్ సైడ్ రాడ్ డిజిటల్ ఇన్నోవేషన్ గురించి ప్రస్తావించింది. ఇటీవల, AI- రూపొందించిన కొన్ని చిత్రాలు ఆమెను చిత్రీకరించే తప్పుడు చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడ్డాయి, ఈ ట్రెండ్ ఇప్పుడు నటులకు కొత్త తలనొప్పిగా మారింది.
 
ఇప్పటికే వీటిపై కేసు పెట్టాలని కొందరు సైబర్ పోలీసు ఆశ్రయించారు. దీనిపై ఈవారంలో ప్రముఖ దినపత్రికలో మెయిన్ స్టోరీగా వచ్చింది కూడా. యువకులను, పెద్దలను కూడా బూతు పదాలతో, బూతు వీడియోలతో ఆకట్టుకునేలా ఏకంగా యూట్యూబ్ లలోనూ, ఫేస బుక్ లలోనూ పెట్టేసి పైశాచికానందంగా అనుభవిస్తున్నారు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన వుందని ప్రముఖులు వాపోతున్నాయి.
 
అయితే, ఇలాంటి ఆన్‌లైన్ దుర్వినియోగం లేదా వక్రీకరణ కేసుగా చూడటానికి బదులుగా, నటి ఆ సవాలుతో కూడిన క్షణాన్ని డిజిటల్ నీతి, సృజనాత్మక జవాబుదారీతనం గురించి  మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇప్పుడు సినిమారంగంలోని ప్రముఖులకు పెద్ద సవాల్ గా పరిగణించింది. ముసలివారిని కుర్రవాడిగా చూపిస్తూ సినిమాటిక్ గా మార్చి ఆకట్టుకోవడం ఎ.ఐ. టెక్నాలజీ తొలుతలో వున్న ప్రధాన మార్పు కానీ రానురాను అది విక్రుత చేష్టలుగా పరిగణించిందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్  కూడా భావిస్తోంది. దీనిపై అన్ని ప్రాంతాల అసోసియేషన్లు పోరాడాలని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. 
 
టెక్నాలజీ సత్యాన్ని ప్రతిబింబించాలి కానీ దానిని వక్రీకరించకూడదు అని ప్రియాంక అభిప్రాయపడింది. శ్రద్ధ కోసం సత్యాన్ని త్యాగం చేసినప్పుడు సృజనాత్మకత దాని సారాన్ని కోల్పోతుందని ప్రియాంక భావించింది. అభిమానులు ప్రియాంక మోహన్‌కు మద్దతుగా నిలిచారు.  ఆమె మాటలు లోతైన సమస్యను హైలైట్ చేస్తాయి. ప్రియాంక ప్రతిస్పందనను మిగిలినవారు కూడా ఏకీభవిస్తున్నారు. మరి ఎంత మేరకు దారితీస్తుందోనని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.