శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (22:02 IST)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

natti kumar
భావ స్వేచ్ఛ పేరుతో బూతులు తిట్టే వైఎస్ఆర్ సీపీ నేత పోసాని కృష్ణమురళిని వెంటనే అరెస్టు చేయాలని సీనియర్ సినీ నటి నట్టి కుమార్ డిమాండ్ చేశఆరు. పోసాని నేటికీ వితండవాదంగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
పోసాని మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలోను ఇష్టారాజ్యంగా చేసుకుని బూతులు తిట్టే విష సంస్కృతికి నాంది పలికిన ఆ పార్టీ కార్యకర్తలు ఎలా రెచ్చిపోయారో ప్రజలందరికీ తెలుసన్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విజన్ కలిగిన నాయకులు, పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు అంతటి వారితో పాటు పవన్ కళ్యాణ్ తదితరులే కాకుండా, వారి కుటుంబాలకు చెందిన మహిళలపైనా కూడా సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులను పెట్టించి, వైకాపా నేతలు పైశాచిక ఆనందం పొందారన్నారు. 
 
ఇవన్నీ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, పోసాని వంటి వారికి తెలియదా అని ప్రశ్నించారు. వీటిని వాళ్లు ప్రోత్సహించ లేదా అనే విషయం ఒక్కసారిగా మననం చేసుకోవాలి. ఇప్పటికీ ఆ సంస్కృతి వైకాపా నేతలు బయటపడకుండా అవాకులు చెవాకులు పేలుతుండటం వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.