శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళి
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (14:54 IST)

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

pushpa
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కి, డిసెంబరు 5వ తేదీన విడుదలకానున్న 'పుష్ప-2' చిత్రం టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, డిసెంబరు 4వ తేదీ 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోతోపాటు అర్థరాత్రి ఒంటి గంట షోకు అనుమతి ఇచ్చింది. 
 
'పుష్ప-2' బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800 వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. 
 
డిసెంబరు 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపు, డిసెంబరు 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చింది. అలాగే, డిసెంబరు 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.