శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (12:29 IST)

"పుష్ప 2: ది రూల్" టీజర్ అప్డేట్.. మాస్ జాతర

Pushpa 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప 2: ది రూల్" సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 భారీ స్థాయిలో రూపొందుతోంది. పుష్ప మాస్ జాతర మంగళవారం మొదలు కానుంది. 
 
ఆగస్టు 15వ తేదీనే ఈ చిత్రం విడుదల కానుంది. అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8వ తేదీన పుష్ప 2 సినిమా టీజర్ రానుందని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ దిశగా మూవీ టీమ్ ఇటీవలే సంకేతాలు ఇచ్చింది. 
 
టీజర్ ఫైనల్ కట్ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. పుష్ప-2 చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.