శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (16:26 IST)

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవంలో రామ్ చరణ్

charan kadapa darga
charan kadapa darga
80వ నేష‌న‌ల్ ముషాయ‌రా గ‌జ‌ల్ ఈవెంట్‌ను ఈ నెల 18న క‌డ‌పలోని అమీన్ పీర్‌ ద‌ర్గాలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ శ్రీ రామ్‌చ‌ర‌ణ్ హాజ‌రు కానున్నారు. కడప అమీన్ పీర్ దర్గా గొప్ప చరిత్ర మరియు ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం. అటువంటి కార్యక్రమాన్నికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో గౌరవప్రదమైన విషయని అభిమానులు తెలియజేస్తున్నారు.
 
ఇటీవలే పాట్నాలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ టీజర్ కార్యక్రమంలో పాల్గొని చిత్ర గురించి పలు విషయాలు తెలియజేశారు. కాగా, కొంతకాలంగా కడప దర్గా విషయంలో రామ్ చరణ్ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అందులో తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జనవరిలో సినిమా విడుదల కావడంతో మరిన్ని పుణ్య క్షేత్రాలను చరన్ సందర్శించనున్నట్లు తెలుస్తోంది.