జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఫాంటసీ వండర్ చిత్రం “జగదేక వీరుడు అతిలోక సుందరి”. 35 ఏళ్ళు తర్వాత రీరిలీజ్ కి వస్తుంది. ఇందులో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. రీరిలీజ్ 3డిలో వస్తుంది. ప్రమోషన్ లో భాగం సుమ యాంకరింగ్ గా చిరంజీవి, నిర్మాత అశ్వినీదత్, రాఘవేంద్రరావు పలు విషయాలు నెమరేసుకున్నారు.
దీనికి సంబంధించిన ప్రోమో నేడు విడుదల చేశారు. షడెన్ గా రామ్ చరణ్ ఆన్ లైన్ వీడియోలో దర్శనమిచ్చారు. జగదేక వీరుడు క్లైమాక్స్ కోసం మాట్లాడారు. చివరిలో ఉంగరం దానిని మింగిన చేప ఏమయ్యాయి. దానికి సమాధానం ఒక్కరే చెప్పగలరు.. అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ ఒక్కరు ఎవరనేది మే 8న ఫుల్ వీడియోలో చెప్పనున్నారు. దీనిపై ఈ సినిమాకు పార్ట్ 2 కూడా వుండబోతోందని సూచాయిగా తెలుస్తోంది.
ఇదిలా వుండగా, కల్కి సినిమా ప్రమోషన్ లో అశ్వనీదత్ రీమేక్ ల గురించి మాట్లాడుతూ, తనకు జగదేవవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలనుందని వెల్లడించారు. ఆ సినిమా రామ్ చరణ్ తో నా లేక మరొకరితోనా అనేది కూడా తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సమాధాన రానున్నదని అభిమానులు ఎదురుచూస్తున్నారు.