బుధవారం, 3 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (11:46 IST)

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

AR Rahman, Ram Charan,  Buchi Babu Sana
AR Rahman, Ram Charan, Buchi Babu Sana
రామ్ చరణ్ పాన్ ఇండియా స్పెక్టకిల్ పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్, రామ్ చరణ్ మేకోవర్ ఫ్యాన్స్‌లో, సినిమా లవర్స్‌లో అంచనాలు పీక్స్‌కి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
మేకర్స్ ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పెద్ది ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన, ఏఆర్ రహ్మాన్ స్టూడియోలో వున్న ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ది కోసం  ఏఆర్ రహ్మాన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని కంపోజ్ చేశారు. ఆడియన్స్, ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్ ని రెడీ చేశారు.    
 
ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రత్నవేలు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్.
 పెద్ది మార్చి 27, 2026న పాన్ ఇండియా గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  
 
నటీనటులు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ