శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 జూన్ 2024 (08:35 IST)

రామ్ చరణ్ కు రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం

RamCharan  at  Rajahmundry airport
RamCharan at Rajahmundry airport
మొన్న కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ తో మెగా వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్ తన డ్యూటీ నిమిత్తం షూటింగ్ కు నిన్న వెళ్ళారు. రాత్రి 11 గంటలకు ఆయన రాజమండ్రి విమానాశ్రయంకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. పోలీసులు, సెక్యూరిటీ గార్డ్ సంరక్షణలో ఆయన కారులోకి ఎక్కి అందరికీ చేతులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
RamCharan  at  Rajahmundry airport
RamCharan at Rajahmundry airport
గేమ్ ఛేంజర్ షూటింగ్ నిమిత్తం రాజమండ్రి వచ్చిన రామ్ చరణ్ కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది. ఇప్పటికే దాదాపు పూర్తి అయిన ఈ సినిమా సాంకేతిక పనులు దేశంలో పలుచోట్ల జరుగుతున్నాయి. కొంత ప్యాచ్ వర్క్ కూడా చేయనున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ చేస్తున్న ఈ సినిమా సమకాలీన రాజకీయ ముఖ చిత్రంగావుండబోతుందనే అందరికీ తెలిసిందే.
 
సినిమాపరంగా రామ్ చరణ్ సి.ఎం. అవుతాడు. ఆ తర్వాత ప్రత్యర్థులు దాడి చేస్తారు. ఆ తర్వాత ఏమిటి? అనే కోణంలో కథ వుందనేది ఇప్పటికే విడుదలైన కథనాలు చెబుతున్నాయి. కియారా అద్వానీ నాయికగా నటిస్తుండగా అంజలి మరో కీలక పాత్రలో నటించింది.