శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (11:38 IST)

పాపం రష్మిక మందన్నా.. మరింత క్లియర్‌గా డీప్‌ఫేక్ వీడియోను సృష్టించిన నేరగాళ్లు..

Rashmika Mandanna
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నా మరోమారు డీప్‌ఫేక్ బారినపడ్డారు. మరింత స్పష్టంగా కనిపించేలా ఆమె డీప్ ఫేక్ వీడియోను కొందరు దండగులు సృష్టించారు. ఈ వీడియోలో ఆమె అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

ఈ వీడియోను చూసిన ఆమె అభిమానులు షాక్ తిన్నారు. ఈ వీడియోను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు.

అయితే, ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ  వీడియోలో ఓ యువతి అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి రష్మిక ముఖాన్ని జతచేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు, రష్మిక మందన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, అల్లు అర్జున్‌తో చేసిన‌ 'పుష్ప' మూవీతో ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కింది. ఆ త‌ర్వాత ఇటీవ‌లే ర‌ష్మిక మందన్న‌ బాలీవుడ్ మూవీ 'యానిమ‌ల్‌'తో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకెళ్తున్న ఆమెకు డీప్‌ఫేక్ వీడియోలు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం ఆమె 'పుష్ప‌-2', 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌', 'రెయిన్ బో' వంటి చిత్రాల‌తో బిజీగా ఉంది.