బుధవారం, 12 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 12 మార్చి 2025 (10:31 IST)

నాకు శ్రీలీలకు హిట్ కపుల్ లా రాబిన్‌హుడ్ నిలబడుతుంది : నితిన్

Srileela, Nithiin, Rajendra Prasad
Srileela, Nithiin, Rajendra Prasad
హీరో నితిన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చిత్రం  రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిరించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో రామానాయుడు స్టూడియోలో ప్రీరిలీజ్ నిర్వహించారు.
 
నితిన్ మాట్లాడుతూ, జీవి ప్రకాష్అ ద్భుతమైన పాటలు ఇచ్చారు.  డైరెక్టర్ వెంకీ నేను నిన్న రాత్రి సినిమా చూసుకున్నాం. ఈ సినిమా మా కెరీర్ హ్యుజ్ మూవీ కాబోతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. నా బర్త్ డే మార్చ్ 30.  ఈ సినిమా వచ్చేది మార్చి 28. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. భీష్మ కి డబల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్ గారు వెన్నెల కిషోర్ మా సీన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. చాలా క్లీన్ కామెడీ ఉంటుంది.  ఎక్కడ అసభ్యకరమైన మాట ఉండదు. ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడ చూడలేదు. ఇంత మంచి స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ వెంకీకి థాంక్యూ.  వెంకీకి ఇది 3.o. కథ ఎమోషన్ స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఆడియన్స్ వావ్ అంటారు. నాకు శ్రీలీలకు ఈ సినిమా  ఒక హిట్ కపుల్ లా నిలబడుతుందనే కాన్ఫిడెంట్ గా ఉన్నాం అన్నారు
 
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ, నితిన్ గారితో వర్క్ చేయడం సెకండ్ టైమ్. ఆయన చాలా సపోర్ట్ చేశారు, నా క్యారెక్టర్ గురించి కూడా కేర్ తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఇందులో ప్రతి ఎలిమెంట్ చాలా నచ్చింది. మైత్రీ మేకర్స్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది'అన్నారు
 
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ, ఈ సినిమాకి బ్యాక్ బోన్ నితిన్ అన్న. నేను రాజేందర్ ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ ని.  ఇందులో క్యారెక్టర్ ఆయన ఉద్దేశించి రాశాను. ఈ సినిమాలో క్యామియో  చేసిన డేవిడ్ వార్నర్ గారికి థాంక్యూ. త్వరలో ఆయన కూడా వస్తారు మీరందరూ చూస్తారు'అన్నారు.  
 
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఇంత క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నితిన్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది.  ఒక అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తుంది' అన్నారు