గురువారం, 21 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2025 (18:38 IST)

రోహిత్ వర్మ, రియా సుమన్ జంటగా నూతన చిత్రం ప్రారంభం

Rohit Verma, Riya Suman Clap by Vijay kanakamedala
Rohit Verma, Riya Suman Clap by Vijay kanakamedala
రోహిత్ వర్మ కథానాయకుడిగా రియా సుమన్ నాయికగా నటిస్తోన్న నూతన చిత్రం మంగళవారంనాడు హైదరాాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్.ఎల్.పి. బేనర్ లో నజీర్ జమాల్ నిర్మిస్తుండగా, గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి  విజయ్ కనకమేడల క్లాప్ కొట్టగా, సీనియర్ దర్శకుడు రామ్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. 
 
అనంతరం చిత్రం గురించి నిర్మాత నజీర్ జమాల్  మాట్లాడుతూ, తెలుగులో నాకిది మొదటి సినిమా. కథ విన్న తర్వాత బాగా నచ్చి సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. రోహిత్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో పాటలు బాగున్నాయి. దర్శకుడు కథకు అనుగుణంగా నటీనటుల ఎంపిక చేయడం జరిగింది అన్నారు.
 
కథానాయకుడు రోహిత్ వర్మ మాట్లాడుతూ, నాకు మంచి కథను దర్శకుడు చెప్పాడు. తెలుగులోకి ప్రవేశించడం చాలా ఆనందంగా వుంది. సీనియర్ సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని నా మనసులో కోరిక వుండేది. ఈ చిత్రంలో అది కుదిరింది. చిత్రం కోసం తెలుగు బాగా నేర్చుకుంటున్నాను. అందరూ మెచ్చే సినిమా అవుతుందని నమ్మకం వుందని అన్నారు.
 
హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ, ఈ సినిమాలో పనిచేయడం పట్ల చాలా సంతోషంగా వున్నాను. మంచి పాత్రను పోషిస్తున్నాను. ఇందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాకు మంచి టైటిల్ పెట్టబోతున్నారు. దానిని వినాయకచవితికి తెలియజేయనున్నారు. తొలుత మోంటేజ్ సాంగ్ లో రేపటినుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నాం. చక్కటి సాహిత్య, సంగీతం ఈ కథకు బాగా కుదిరింది. 
 
దర్శకుడు  గోవిందరెడ్డి చంద్ర మాట్లాడుతూ, క్రేజీ కింగ్ ప్రొడక్షన్ లో క్రేజీ కథతో రాబోతున్నాం. ఛోటాకె. ప్రసాద్, మణిశర్మ వంటి సీనియర్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. కథ అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా వుంటుంది. రోహిత్ హిందీలో చేశాడు. తెలుగులో మొదటి సినిమా.  రియా కథ నచ్చి బాగా సపోర్ట్ చేసింది. ఇది పక్కా కమర్షియల్ సినిమా అవుతుందనే నమ్మకముంది. పూర్తి వివరాలు వినాయకచవితికి తెలియజేస్తామని అన్నారు.