గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (19:20 IST)

నేను ఏదో ఒక రోజు తల్లిని కావాలని ఎదురు చూస్తున్నాను- సమంత

samantha
చై-సామ్ విడాకుల గురించి తెలిసిందే. ప్రస్తుతం సమంత సినిమాలపై దృష్టి పెట్టింది. చైతూ హ్యాపీగా రెండో పెళ్లి చేసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో సమంత తనకు తల్లిని కావాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇంకా పేరెంట్‌హుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
 
జీవితంలో ఏదో ఒక సమయంలో తల్లి కావాలనుకుంటున్నారా లేదా ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందా అనే ప్రశ్నకు సమంత చాలా బోల్డుగా సమాధానం ఇచ్చింది. 
 
"ఇది చాలా ఆలస్యం కాదు. నేను త్వరగా తల్లి కావాలని నిజంగా కోరుకుంటున్నాను. నేను ఎప్పటినుండో తల్లి కావాలని కోరుకుంటున్నాను. నేను ఏదో ఒక రోజు తల్లి కావాలని ఎదురు చూస్తున్నాను"అని సమంత తెలిపింది. తనకు నిజజీవితంలో తల్లి కావాలనే కలలు ఉన్నాయి అని సామ్ తెలిపింది. ప్రస్తుతం తాను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది.