సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14న సిద్దం
Roja Bharati, Dinesh, Anupama
రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ నటించిన సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఈ చిత్రానికి దర్శకుడిగా దేవేందర్. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్ గా డా. రాజీవ్, డా. రోజా భారతి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ప్రెస్ మీట్ గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించారు.
హీరోయిన్ డా.రోజా భారతి మాట్లాడుతూ ... ఈ సినిమా నాది అని అనుకుని అందరూ పనిచేసారు కాబట్టే ఇవాళ రిలీజ్ వరకు రాగలిగాం. అందరు నవంబర్ 14 న మా సినిమా ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
హీరో దినేష్ మాట్లాడుతూ .. కచ్చితంగా మా సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాను.
*హీరోయిన్ రాఖి శర్మ మాట్లాడుతూ. ఈ చిత్రం లో రాధికా అనే క్యారెక్టర్ లో నటిస్తున్న నాకు ఈ రోల్ చాలా స్పెషల్. సీత ప్రయాణం కృష్ణ తో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా.
డా.రాజీవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా మాకు చాలా సెంటిమెంట్. సినిమా లో నటించి, ప్రొడ్యూసర్ గా డా. రోజా భారతి గారు మాకు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. అందరు నవంబర్ 14 న మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా.