శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (14:34 IST)

శ్రీవిష్ణు ను కమల్ హాసన్ తో పోల్చవచ్చు అనేది ధైర్యంగా చెబుతున్నా : నిర్మాత టీజీ విశ్వప్రసాద్

Ritu Verma, Srivishnu,  TG Vishwaprasad, Hasit Goli
Ritu Verma, Srivishnu, TG Vishwaprasad, Hasit Goli
శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ సినిమా 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. 
 
శ్రీవిష్ణు మాట్లాడుతూ, కథ విని ఆశ్చర్యపోయా. చాలా పెద్ద కథ. వంశాలు, తరాలకు సంబంధించిన ఇంత పెద్ద కథను చెప్పడం ఈజీ కాదు. అప్పటికి నేను ఏ సినిమాలోనూ డబుల్ యాక్షన్ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రలు పోషించాలనగానే కొంచెం భయమేసింది. కానీ, హసిత్‌పై నాకు నమ్మకం ఉంది. తను ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసు.  టీజీ విశ్వ ప్రసాద్‌ గారు వంద కాదు రెండు వందల సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ప్యాక్డ్ గా వున్న థియేటర్స్ లో చూడండి పిచ్చెక్కిపోతుంది. ఇది నా ప్రామిస్. తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్ల మేం గెలుస్తూ ఉంటాం. ఎన్నో విజయాలు అందించారు. ఈసారి మిమ్మల్ని నేను గెలిపించాలనుకుంటున్నా. సినిమా చూసిన తర్వాత మీ పేరెంట్స్ కి ఫోన్ చేస్తారు. మీరే వాళ్ళని సినిమాకి తీసుకెళతారు. సినిమాని ఎవరూ మిస్ అవ్వరని నమ్ముతున్నాను. అక్టోబర్ 4న థియేటర్స్ కి వచ్చి మీరు గెలిచి నన్ను గెలిపిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ' అన్నారు.
 
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ,  ఒకొక్కసారి కంటెంట్ వున్నప్పుడు, మార్కెట్ కి మించిన స్పాన్ వున్నప్పుడు చేసే సినిమాలు కొన్ని వుంటాయి. అలా చేసిన వాటిలో మాకు గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ2 చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాయి. శ్వాగ్ కూడా లాంటి కేటగిరీలోకే వస్తుంది. అలాంటి సక్సెస్ వస్తుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు గారిని కమల్ హాసన్ గారితో పోల్చడం అనేది ధైర్యంగా చెప్పొచ్చని భావిస్తున్నాను. ఇందులో శ్రీవిష్ణు చేసిన క్యారెక్టర్స్ దేనికవి యూనిక్ గా వుంటాయి. ప్రతి పాత్రకు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. హసిత్ అద్భుతంగా తీశాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. అక్టోబర్ 4న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను'అన్నారు. 
 
హీరోయిన్ రీతు వర్మ మాట్లాడుతూ, విష్ణు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తన హార్డ్ వర్క్ చూసి చాలా ఇన్స్ పైర్ అయ్యారు. విష్ణు, హసిత్ తో కలసి వర్క్ చేయడం ప్రతి రోజు మెమరబుల్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. పెళ్లి చూపుల తర్వాత వివేక్ సాగర్ తో నా సెకండ్ కొలాబరేషన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.  అన్నారు. 
 
మూవీ డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ... శ్రీ విష్ణు, వివేక్ నాకు గురు సమానులు. వాళ్ల సపోర్ట్ తోనే ఈ జర్నీ కంటిన్యూ చేస్తున్నాను. కథను నమ్మి సినిమాని చేసే ప్రొడ్యూసర్ విష్ణు ప్రసాద్ గారు. రాజరాజ తర్వాత సెకండ్ ఫిల్మ్ వారి నిర్మాణంలోనే చేయడం చాలా ఆనందంగా ఉంది. విశ్వ గారు గడ్సీ ప్రొడ్యూసర్. చాలా సపోర్ట్ చేశారు. సినిమాకి కావాల్సింది ఎక్కడ రాజీ పడకుండా సమకూర్చారు. కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు. ఆయన హీరో అవ్వాలని ఏ సినిమా చేయలేదు. కథ హీరో అవ్వాలని చేశారు. ఆయన కథానాయకుడిగా చేస్తున్నారు. అక్టోబర్ 4న బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్, బెస్ట్ మూవీని చూడబోతున్నారు. చాలా ఆత్మవిశ్వాసంతో ఈ మాట చెప్తున్నాను. రీతు గారు చాలా స్ట్రాంగ్ రోల్ చేస్తున్నారు. ఎఫర్ట్ లెస్ గా చేశారు. మీరా జాస్మిన్ గారు మరో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు. అందరి దగ్గరికి సినిమా వస్తోంది. దసరా అయిపోయిన తర్వాత కూడా ఇంకా చూస్తూనే వుంటారనేది నా నమ్మకం. అక్టోబర్ 4న కలుద్దాం' అన్నారు.