శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (15:48 IST)

సరైన అంశాలతో క్షమాపణలు తెలియజేస్తానని ప్రకటించిన శ్రీకాంత్ అయ్యంగార్

Srikanth Iyengar
Srikanth Iyengar
ఇటీవలే పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్ లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ, రివ్యూవర్స్ పై ఘాటుగా స్పందించారు. దరిద్రం వాంతు చేసుకుంటే పుట్టుకునే పురుగులుగా ఆయన పోల్చారు. షార్ట్ ఫిలిం కూడా తీయడం చేతకాని వారు సినిమా గురించి లాగ్ వుందంటూ రకరకాలుగా రివ్యూలలో రాయడంపట్ల ఆయన తీవ్రపదజాలంతో ఆక్షేపించారు. దానితో కొందరు హర్ట్ అయి మా అధ్యక్షుడిగా వున్న మంచు విష్ణు కు లెటర్ రాశారు.
 
ఈ విషయంతెలిసిన శ్రీకాంత్ అయ్యంగార్ నేడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశారు. నేన్న మాటలు కొందరికి బాధ కలిగించినందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. సరైన అంశాలతో త్వరలో క్షమాపణలు తెలియజేస్తానని తెలియజేశారు. 
 
ఇలా రివ్యూవర్స్ పై గతంలో పలువురు దర్శకులు, హీరోలు కూడా తీవ్రవిమర్శలు చేశారు. పూరీ జగన్నాథ్, మోహన్ బాబు తదితరులు ఘాటుగా విమర్శించిన సందర్భాలున్నాయి. అయితే ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సోషల్ మీడియా, యూట్యూబ్ లవల్ల ఇలాంటి రివ్యూవర్స్ పై అపకీర్తి వస్తుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.