శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జులై 2024 (20:52 IST)

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

Sudheer babu
Sudheer babu
ప్రణీత్ హనుమంతు ఓ యూట్యూబర్. ప్రస్తుతం ఇతని పేరు ట్రెండింగ్‌లో వుంది. ఇదేదో మంచి చేసి సారు గారూ ట్రెండింగ్ కాలేదు. బాలికపై చేసిన కామెంట్స్ వల్ల ఆతనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తండ్రీ కూతుళ్ల రిలేషన్‌కు సంబంధించిన ఓ వీడియోపై.. డార్క్ కామెడీ పేరుతో అసభ్యకర కామెంట్స్ చేశాడు ఈ వ్యక్తి. ఈ కామెంట్స్‌పై సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో హనుమంతుపై కేసు కూడా నమోదైంది.
 
తాజాగా హనుమంతుపై నటుడు సుధీర్ బాబు ఫైర్ అయ్యాడు. ప్రణీత్ నటుడిగా కూడా కొనసాగుతున్నాడు. గతంలో అతను సుధీర్ బాబు హీరోగా చేసిన హరోం హర సినిమాలో నటించాడు. ఈ నేపథ్యంలో హనుమంతు లాంటి వాడిని తమ సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గుగా ఉందని సంచలన కామెంట్స్ చేశాడు. 
 
"అతను చీడ పురుగు తమకు తెలియదని.. తెలిస్తే సినిమాకు తీసుకునేవాళ్లమే కాదని పేర్కొన్నాడు. మా అందరినీ క్షమించండి.. ఇలాంటి వాళ్లని వెంటనే శిక్షించాలి" అని సుధీర్ బాబు ట్వీట్ చేశాడు.