1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 12 మే 2025 (09:44 IST)

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

Sudheer Babu new look
Sudheer Babu new look
సుధీర్ బాబు నూతన చిత్రం పోస్టర్ ఆసక్తికలిగించేలా వుంది. ఇందులో సుధీర్ బాబు షర్ట్  లెస్ గా,  సాలిడ్ ఫిజిక్ తో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. మెట్లపై మృతదేహాలు పడిపోతుండగా, ఆయన ఒక చేతిలో ఆయుధాన్ని పట్టుకుని పైకెత్తుతూ కనిపించడం చాలా క్యూరియాసిటీని పెంచింది. #PMFxSB సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందించబడుతోంది. పోస్టర్‌లోనే ఉత్కంఠను పెంచుతూ, ఇంటెన్స్ మూడ్‌ను సెట్ చేసింది. "A Broken Soul On A Brutal Celebration" అనే ట్యాగ్‌లైన్ సుధీర్ బాబు  క్యారెక్టర్ డెప్త్ ని తెలియజేస్తోంది.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నవదళపతి సుధీర్ బాబు హీరోగా తమ 51వ ప్రొడక్షన్‌ను  అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి RS నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. #PMFxSB  చిత్రాన్ని విజినరీ నిర్మాతలు TG విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
 
వైవిద్యమైన పాత్రలను ఎంచుకోవడంలో మంచి పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు, ప్రతిసారి కొత్తదనం కోసం వినూత్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే ధోరణిలో ఈ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా అధికారికంగా సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు
 
ఈ పాత్ర కోసం మరోసారి సుధీర్ బాబు తన ఫిజిక్ ని మేకోవర్ చేస్తూ, కండలు తిరిగిన మాచో లుక్‌లో మారిపోయారు. బలమైన యాక్షన్ పాత్ర కోసం ఆయన  బీస్ట్ మోడ్‌లోకి వెళ్ళారు. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ డీటెయిల్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.