ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు
బాలీవుడ్ బుల్లితెర నటి నవీనా బోలే ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని ఇపుడు ప్రస్తావించించారు. ఒక ప్రాజెక్టు చర్చల సందర్భంగా సాజిద్ ఖాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు హిందీ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
20 యేళ్ళ క్రితం ఒక ప్రాజెక్టు విషయంలో సాజిద్ ఖాన్ బృందం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయనను కలవడానికి వెళ్లినట్టు ఆమె తెలిపారు. అయితే, ఆ సమయంలో సాజిద్ ఖాన్ తనను బట్టలు విప్పి కూర్చోమని అడిగారని నవీనా ఆరోపించారు. ఆయన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏం చేయాలో తోచలేదు. భయంతో నా స్నేహితులు బయటవేచివున్నారని చెప్పి అక్కడి నుంచి వెంటనే ఇంటికి వచ్చేశాను అని నవీనా వెల్లడించారు.
ఆ సంఘటన తర్వాత తనకు సాజిద్ ఖాన్ బృందం నుంచి పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ తాను స్పందించలేదని చెప్పారు. ఆ రోజు జరిగిన ఘటనతో మళ్లీ జీవితంలో సాజిద్ ఖాన్‌ను కలవకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కాగా, నవీనా బోలే చేసిన ఈ ఆరోపణలు ఇపుడు బాలీవుడ్‍లో చర్చనీయాంశంగా మారాయి.