బుధవారం, 27 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2025 (15:30 IST)

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Teja Sajja, Manoj Manchu Poratam
Teja Sajja, Manoj Manchu Poratam
హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాటు, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను సమకూరుస్తున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, బిటిఎస్ వీడియో వైబ్ ఉంది సాంగ్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ట్రైలర్ ఆగస్టు 28న విడుదల చేయనున్నారు.
 
హీరో, విలన్ పవర్ ఫుల్ గా కనిపించిన ట్రైలర్ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. తేజ సూపర్ యోధాగా ఎనర్జీతో మెరుస్తున్న మ్యాజికల్ స్టిక్ తో కనిపించగా, మనోజ్ ఫెరోషియస్ బ్లాక్ స్వోర్డ్ గా, భారీ ఖడ్గాన్ని పట్టుకుని ఎదురు నిలబడ్డాడు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి.
 
ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.
 
ట్రైలర్ పోస్టర్ ద్వారా మేకర్స్ సినిమాను సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
 
తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు