శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (07:40 IST)

బాహుబలి, ఆర్ఆర్ఆర్ వచ్చినప్పుడు తెలుగువారు గర్వించారు. ఆ తర్వాత పుష్ప ఆడాలి : అల్లు అర్జున్

Allu arjun
Allu arjun
పుష్ప1 పూర్తయ్యేప్పటికీ పుష్పా 2 కథను వినలేదు. కానీ పూర్తిగా నమ్మకం ఉంది పుష్ప 2 అస్సలు తగ్గేదేలే అని. ఇక్కడికి వచ్చేసాను ప్రతి ఒక్కరికి నా థాంక్స్. మూడు సంవత్సరాల క్రితం ఇదేవిధంగా పుష్ప 1 సినిమాకు ఫంక్షన్ చేశాం. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా కలుస్తున్నాం అని అల్లు అర్జున్ అన్నారు.
 
allu arjun-arhan
allu arjun-arhan
ఆయన కథానాయకుడిగా నటించిన పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన రాబోతుంది.  రష్మిక మందన్నతో జంటగా నటిస్తూ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలు. హైదరాబాదులో ఈ చిత్ర ఈవెంట్ జరుగుతుండగా ఎన్నడూ లేని విధంగా సుమారు 1000 మంది పోలీసులు ఈవెంట్ కు బలగంగా నిలవడం జరిగింది.
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ...నా ఆర్మీగా నేర్పించుకునే నా ఫాన్స్ అందరికీ లవ్ యు. ముందుగా మా నిర్మాతలు మైత్రి నవీన్ గారికి, మైత్రి రవి గారికి ధన్యవాదములు. వీళ్ళు కాకుండా ఇంకా ఏ నిర్మాతలు అయినా ఈ సినిమా తీయగలిగే వారు కాదు. మమ్మల్ని నమ్మి ఈ సినిమాపై కోట్లు ఖర్చు పెట్టినందుకు వారికి థాంక్స్. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా రెండు పార్ట్స్ కలిపి ఐదు సంవత్సరాలు జీవితాన్ని ఇచ్చిన అందరి గురించి మాట్లాడాలి. ఈ చిత్రం కోసం పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా డిఓపి కూబా గారికి, ఆర్ట్ డైరెక్టర్స్ కి, కొరియోగ్రాఫర్స్ కి పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే సినిమా కోసం పని చేసిన ఫైట్ కొరియోగ్రాఫర్స్, చంద్రబోసు గారికి, ఇతర భాషలలో లిరిక్స్ రాసిన అందరికీ థాంక్స్. అలాగే నా స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే మా జర్నీ 20 ఏళ్ల నుండి ఉంది. నీకు చాలా థాంక్స్. 
 
అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి. ముందుగా ఫహద్ ఫజల్ గారు ఎంతో అద్భుతంగా నటించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. కేరళ వారు అంతా ఆయనను చూసి గర్వపడే విధంగా నటించారు. అలాగే ఈ సినిమాలో నటించిన రావు రమేష్ గారు, సునీల్ గారు, అనసూయ గారు తదితరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పర్ఫార్మ్ చేసిన శ్రీలీల ఈ జనరేషన్ లో తెలుగు వారందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా ఉంటుంది. తెలుగు వారంతో గర్వించే స్థాయికి మమ్మల్ని తీసుకుని వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఐదు సంవత్సరాల నుండి నాతో కలిసి పనిచేసిన రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను కాకుండా ఇంకా వేరే వారైతే ఈ ఐదు సంవత్సరాలు ఎలా గడిచేదో కూడా నాకు తెలియదు. రెండు రోజులపాటు కనీసం నిద్ర కూడా లేకుండా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా పీలింగ్స్ సాంగ్ కోసం పనిచేస్తుంది. తన కళ్ళను చూసి ఆశ్చర్యపోయిన నేను నిద్రపోయావా అని అడిగితే తను లేదు అంది. అది చూసి నాకు ఎంతో బాధ వేసింది. తను అంత ప్రొఫెషనల్ గా ఈ సినిమా కోసం పనిచేస్తుంది. ఈ సినిమా నీకు చాలా గొప్ప పేరు తీసుకుని కోరుకుంటున్నాను. ఇలాంటి అమ్మాయిలతో కలిసి పని చేయాలి అనిపించేలా పని చేశావు. 
 
సుకుమార్ గురించి చెప్పాలి అంటే పుష్ప అనేది సుకుమార్ సినిమా. ఈయనను చూసి ఇంత గొప్ప డైరెక్టర్ తెలుగులో ఉన్నాడా అనుకునేలా పనిచేస్తారు. సినిమాను ప్రమోట్ చేయడం కోసం మేము దేశమంతా తిరుగుతుంటే ఆయన మాత్రం సినిమా ఇంకా బాగా వచ్చేలా చేయడానికి కష్టపడుతూనే ఉన్నారు. ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డారు అనడం కంటే తమ జీవితాలను పెట్టేసారు అనడం కరెక్ట్. సుకుమార్ గారు లేకుండా ఇది జరిగేదే కాదు. ఆయన లేకుండా మేము లేము. జీవితంలో అందరూ తమ ఐదు సంవత్సరాల కాలాన్ని ఆయనను నమ్మి పెట్టాము. ఆయన నాతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను లేను. ఈ సినిమా నాకోసం ఆడాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మూడుసార్లు మాత్రం ఈ సినిమా ఆడాలనుకున్నాను. సుకుమార్ గారి కష్టం చూసి అనుకున్నాను. 
 
ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడిన చిత్ర బృందం కోసం సినిమా ఆడాలి అనుకున్నాను. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంతో గర్వించారు. ఆ తర్వాత పుష్ప సినిమాతో అంతే స్థాయిలో ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలి అనుకున్నాను. ఈ సినిమా కోసం మా బెస్ట్ ఇచ్చేసాము. నేను ఇప్పుడు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. డిసెంబర్ 5వ తేదీన మీకు సినిమా చూశాక ఆ విషయం అర్థమవుతుంది. సుకుమార్ గారు మాట్లాడేటప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను చూడబోతున్న ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, సినిమా తీసింది మేము అయినా తీసింది మీకోసం. ఇది మా గొప్పతనం కాదు,  మీ ఆదరణ. ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా స్క్రీన్ లలో 80 పైగా దేశాలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఆరు భాషలలో ఓ పండగ వాతావరణం ఉండబోతుంది. దీనికి ఎంతో గర్విస్తున్నాను. అలాగే ఈ ఈవెంట్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన తెలంగాణ పోలీసులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. చివరిగా మరొకసారి నా అభిమానులకు థాంక్స్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్" అంటూ ఈ ఈవెంట్ ముగించారు.