శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2025 (16:33 IST)

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

Anita Chaudhary
Anita Chaudhary
యాంకర్ యాక్టర్ అనిత చౌదరి ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో హీరో మదర్ పాత్రల్లో రాణిస్తున్న ఆమె లిటిల్ హార్ట్స్ , రాజు వెడ్స్ రామ్ భాయ్ ఇలా ఏ సినిమా లో నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో గోల్డెన్ మదర్ అంటున్నారు. ఇండస్ట్రీ లో ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. 31 ఏళ్ల క్రితం టీవీ సీరియల్స్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పటికీ అలానే మెయిన్ టైన్ చేస్తోంది. 
 
ఆమె మాట్లాడుతూ, షూటింగ్ లో వున్న డ్రెస్ కోసం రోడ్డుమీద అమ్మేవి కొని ధరించేదాన్ని అవి చూసి భలే వుంది అనేవారు. ఛత్రపతి సినిమాలో లో ప్రొఫైల్  దుస్తులు నేను తెచ్చుకున్నవే. ఇక యాంకర్ గా హైయెస్ట్ పేమెంట్ తీసుకున్న ఫస్ట్ యాంకర్ నేను. అలాగే ఫస్ట్ టైం ముగ్గురు అసిస్టెంట్స్ ఉన్న ఆర్టిస్ట్ నేను.  ⁠ఫస్ట్ కార్ , మాదాపూర్ లో ఇల్లు కొనుక్కోవటం అప్పట్లో నా అచివిమెంట్స్.  కెరీర్ పీక్లో ఉండగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి పోయాను.
 
జీవితంలో చిన్న చిన్న విషయాలు కూడా నేర్చుకోవాలి. సైకిల్ తొక్కడం, కారు డ్రైవింగ్ నేర్చుకోవడం, డాన్స్ నేర్చుకోవడం ఇలా ప్రతీదీ మనిషిగా మనం తెలుసుకుని వుండాలి. అలాగే ఫుడ్ విషయంలో తేడా వస్తే ప్లేట్ విసిరేసేదాన్ని. అది కూడా ఓపిక నశించి చేసిందే. అలాగే మా భర్తను యు.ఎస్.లో వుండగా, బ్యాంటెంటెన్ ఆడించేదాన్ని. ఎందుకని చెబుతున్నానంటే ఆరోగ్యానికి అవసరం అది. నా మాట వినేవాడు.
 
జెమినీ కిరణ్, జునైత్, జయంత్ పరాన్జీ, వారి భార్య నన్ను బాగా పాపులర్ అయ్యేలా చేశారు. పబ్లిక్ డిమాండ్ షో  నా చేత చేయించేలా చేసి నన్ను ఇండస్ట్రీకి మరింత దగ్గర చేశారు. ఆ తర్వాత కస్తూరి సీరియల్ ఎంతగానో పేరు తెచ్చేలా చేసింది. దూరదర్శన్ లో సరోగసీ పై దూరదర్శన్ లో డాక్యమెంటరీ చేయింది మంజులా నాయుడు. అసలుసరోగసి అనే కాన్సెప్ట్ కూడా తెలీని రోజులవి 1998లో. ఆ తర్వాత నేను చేసిన నటనకు టీవీకి నంది అవార్డుకూడా దక్కాయి. అప్పుడు నేను యు.ఎస్.లో వున్నాను. ఆమెకు ఎందుకని కొందరు ప్రశ్నిస్తే, దర్శక నిర్మాతలు ఆమె తెలుగు నటి అని పట్టుబడి మరీ వచ్చేలా చేశారు.
 
మొదట్లో షూటింగ్ కు తెల్లవారి జామున 4గంటలకు అంబాసిడర్ కారు ఇంటికి వచ్చేది. అక్కడనుంచి రాజీవ్ కనకాల, సమీర్ ఇలా ఆరుగురుని ఆ కారులో కుక్కి మరీ తీసుకెళ్ళేవారు. దాంతో కొద్దిరోజులకు విసుగు పెట్టి చిన్న కారు కొనుక్కున్నాను. అది వందసార్లు ఆలోచించి లోన్ మీద కొట్టాను. అప్పట్లో సీరియల్ లో మేకప్ మేన్ అందరికీ మేకప్ వేసేవాడు. అతను సరిగ్గా వేసీ వేయక కొన్ని సీన్లలో బెడిసికొట్టేది. దాంతో నేను కొత్త మేకప్ మేన్ ను పర్సనల్ గా పెట్టుకున్నాను. 
 
టీవీలో నాన్న, అమ్రుతం సీరియల్ లో ఎక్కువ పారితోషికం. జెమీనీలో యాంకర్ గా15వేలు అమౌంట్ తీసుకున్నాను. ఇలా సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనుక్కోగలిగాను. ఇప్పుడు జనరేషన్ నటీనటులు సంపాదించుకుని రిలాక్స్ అవుతున్నారు. నేన మాదాపూర్ లో ఇల్లు తీసుకున్నప్పుడు అంతా అడవీ. రాత్రుళ్ళు షూటింగ్ నుంచి తిరిగి వెళ్ళాలంటే భయపడేదాన్ని. అలాంటిది ఇప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది.