Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత
ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం శుభం. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
సమంత మాట్లాడుతూ .. వైజాగ్‌కు వస్తే ప్రతీ సారి సినిమా బ్లాక్ బస్టర్ వస్తోంది. వైజాగ్‌లో అభిమానుల్ని చూసి నాకు నిజమైన ప్రేమ ఏంటో అర్థమైంది. మా డైరెక్టర్ ప్రవీణ్ ఎనర్జీ చూసి నేను అంతా మర్చిపోయాను. నిర్మాతగా నేను ఓ కొత్త ఆలోచనతో ఈ శుభం సినిమాను స్టార్ట్ చేశాను. కొత్త వారితో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతో ట్రా లా లా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశాను. అదే నా లక్ష్యం. మే 9న ఫ్యామిలీతో కలిసి మా మూవీని చూడండి. ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి ఓ మంచి నవ్వుతో బయటకు వస్తారు అని అన్నారు.
సమంత మాట్లాడుతూ .. వైజాగ్‌కు వస్తే ప్రతీ సారి సినిమా బ్లాక్ బస్టర్ వస్తోంది. వైజాగ్‌లో అభిమానుల్ని చూసి నాకు నిజమైన ప్రేమ ఏంటో అర్థమైంది. మా డైరెక్టర్ ప్రవీణ్ ఎనర్జీ చూసి నేను అంతా మర్చిపోయాను. నిర్మాతగా నేను ఓ కొత్త ఆలోచనతో ఈ శుభం సినిమాను స్టార్ట్ చేశాను. కొత్త వారితో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతో ట్రా లా లా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశాను. అదే నా లక్ష్యం. మే 9న ఫ్యామిలీతో కలిసి మా మూవీని చూడండి. ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి ఓ మంచి నవ్వుతో బయటకు వస్తారు అని అన్నారు.
ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ .. శుభం సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు తెలుగులో ఇలాంటి కంటెంట్ రాలేదు. ఇలాంటి కొత్త కంటెంట్ రావడం చాలా అరుదు. ఇలాంటి హారర్, కామెడీ జానర్‌లో చిత్రాలు రాలేదు. ఇలాంటి సినిమాలకు ఇప్పుడు బ్రాండ్ అయ్యారు. సమంత గారి లాంటి వారు లేకపోతే మా శుభం ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు. నన్ను నమ్మి రాజ్ అండ్ డీకే గారు సినిమా బండి అవకాశం ఇచ్చారు. నేను వారికి ఎప్పుడూ రుణ పడి ఉంటాను. రైటర్స్ వల్లే సినిమా నిలబడుతుంది. ఈ చిత్రానికి వసంత్ అద్భుతమైన కంటెంట్ ఇచ్చారు. హర్షిత్ ఎంతో సహజంగా నటించాడు. శ్రీనివాస్ ఓ దర్శకుడిగా కాకుండా నటుడిగా మాతో కలిసి పోయారు. షాలినీలో మంచి రైటర్ ఉన్నారు. చరణ్ అద్భుతంగా నటించాడు. ఈ చిత్రాన్ని మార్నింగ్ షో చూసే వారు చాలా లక్కీ. శనివారంకి టాక్ మొత్తం బయటకు వస్తుంది. సినిమా గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అన్నారు.
రైటర్ వసంత్ మరింగంటి మాట్లాడుతూ .. సమంత గారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. సమంత గారి వల్లే ఈ ప్రాజెక్ట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రవీణ్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. సినిమా పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంటుంది. మేం సినిమా బండికి కలిసి పని చేశాం. రాజ్ గారు మాకు ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. సీరియల్స్‌ని అందరూ తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ నాకు వాటిపై చాలా గౌరవం ఉంటుంది. అదే ఇందులో హారర్ ఫాంలో చూపించాం. కుటుంబ సమేతంగా ఈ మూవీని చూడొచ్చు. మే 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.
మాట్లాడుతూ .. మెయిల్ చిత్రం తరువాత ఒక సారి ఎయిర్ పోర్టులో రాజ్ అండ్ డీకే సర్ నన్ను గుర్తు పట్టారు. అప్పుడే శుభం చిత్రానికి నాంది పడినట్టుంది. శుభం కథ అద్భుతంగా ఉంటుంది. వసంత్ గారి కథ ఎంత అద్భుతంగా ఉంటుందో.. తెరపై తీసుకు రావడంలో ప్రవీణ్ గారు మ్యాజిక్ చేశారు. ప్రవీణ్ అన్నతో పని చేసే అవకాశం రావడం అదృష్ణం. కథే మా అందరినీ ఒకే దగ్గరకు తీసుకు వచ్చింది. శ్రియా, శ్రావణి, షాలినీ అందరూ అద్భుతంగా నటించారు. చరణ్, నా జర్నీ ఒకేలా అనిపిస్తుంది. శ్రీనివాస్ అన్న మాతో చక్కగా కలిసి పోయారు. క్లింటన్ గారి సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. వివేక్ సాగర్ బీజీఎం అందరినీ షేక్ చేస్తుంది. సమంత గారంటే నాకు చాలా ఇష్టం. సమంత గారి ప్రొడక్షన్‌లో నేను మొదటి హీరో అని గర్వంగా చెప్పుకుంటాను. సమంత గారి ప్రాజెక్ట్ అంటే ఓ క్వాలిటీ, ఓ హానెస్టీ ఉంటుంది. శుభం లాంటి చిత్రాన్ని మాతో తీసిన సమంత గారికి థాంక్స్. మే 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.
నటుడు చరణ్ మాట్లాడుతూ .. వైజాగ్‌లో షూటింగ్ చేసి వెళ్లిన తరువాత చాలా బాధగా అనిపించింది. వైజాగ్‌ను వదిలి వెళ్లాలని అనిపించలేదు. ఇక్కడ షూట్ చేసిన చిత్రాలన్నీ హిట్ అవుతుంటాయి. మా కాలేజీలో సమంతకి ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. సమంత గారంటే నాకు చాలా అభిమానం. ఆమె చాలా కష్టపడుతుంటారు. సినిమాల పట్ల ఆమెకు చాలా ప్యాషన్ ఉంటుంది. ప్రవీణ్ అన్న, వసంత్ అన్న కాంబినేషన్ బాగుంటుంది. మే 9న మా చిత్రం రాబోతోంది. హారర్, కామెడీ ఇలా అన్ని అంశాలుంటాయి. కచ్చితంగా థియేటర్లోనే చూడండి అని అన్నారు.
శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ .. సమంత గారు చాలా డేరింగ్‌గా శుభం సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మాతగా కనిపిస్తారు. ఈ చిత్రంతో ఎంతో మంది ఆర్టిస్టుల్ని పరిచయం చేసి మాతగా మారారు. ఇంకా ఇలాంటి చిత్రాలెన్నో నిర్మించారు. ప్రవీణ్ కండ్రేగుల చాలా మంచి వ్యక్తి. వసంత్ గారి రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. హిమాన్ గారు సెట్స్‌లో చాలా సీరియస్‌గా ఉండేవారు. మృదుల కెమెరా వర్క్ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రంతో నాకు చాలా మంది మంచి స్నేహితులు అయ్యారు. మే 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడదగ్గ చిత్రమని అన్నారు.
షాలిని మాట్లాడుతూ .. శుభం కథ బాగుంటుంది. వసంత్ గారి రైటింగ్ అద్భుతంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో, కథలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ప్రవీణ్ గారికి సెట్‌లో పూనకాలు వస్తుంటాయి. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. మాకు అవకాశం ఇచ్చిన సమంత గారికి థాంక్స్. మే 9న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.
ఐకానిక ప్రతినిధి అవినాష్ మాట్లాడుతూ .. నిర్మాతగా తొలి సినిమాతో ముందుకు వస్తున్న సమంత గారికి ఆల్ ది బెస్ట్. శుభం చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని అన్నారు.