గురువారం, 4 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 3 సెప్టెంబరు 2025 (18:37 IST)

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

Anushka Shetty - Ghati
Anushka Shetty - Ghati
అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో క్వీన్ అనుష్క శెట్టి సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
ఫిలిం జర్నీలో 20 ఇయర్ ఇది. యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? 
-చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఘాటీలో చేసిన శీలావతి అమేజింగ్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ని నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. కంఫర్ట్ జోన్ ని దాటి చేసిన సినిమా ఇది. 
 
- అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి.. ఈ సినిమాలన్నిటిలోనూ చాలా బలమైన పాత్రలు చేశాను. ఘాటిలో చేసిన శీలావతి క్యారెక్టర్ కూడా అంత బలంగా ఉంటూనే ఒక డిఫరెంట్ షేడ్ తో ఉంటుంది. 
 
-ప్రతి విమెన్ సింపుల్ గా సున్నితంగా కనిపిస్తున్నప్పటికీ ఏదైనా ఒక సిచువేషన్ వచ్చినప్పుడు ఒక బలమైన పిల్లర్ లాగా నిలబడతారు. విమెన్ లో ఉండే గొప్ప క్వాలిటీ అది. క్రిష్ గారు అలాంటి ఒక బలమైన పాత్రని తీర్చిదిద్దారు. 
 
ఘాటీ కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి? 
-క్రిష్ గారు, రచయిత శ్రీనివాస్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఆ కల్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. లొకేషన్స్ కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్, కల్చర్, ఒక కొత్త విజువల్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నామనే ఎక్సైట్మెంట్ కలిగింది. 
 
గంజాయి ఎలిమెంట్ ఉంది కదా.. అది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? 
-క్రిష్ గారు ఎప్పుడు కూడా సోషల్ గా రెలెవెంట్ ఉండే కథలనే ఎంచుకుంటారు. సొసైటీలో ఉండే సీరియస్ ఇష్యూ ఇది. మేము ఈ సినిమాని యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గానే తీసాం. ఐతే ఈ కథలోనే చక్కని సందేశం కూడా ఉంది. అది చాలా పాజిటివ్ గా ఉంటుంది. 
 
వేదం తర్వాత క్రిష్  చేస్తున్న సినిమా ఇది. ఆ అంచనాల్ని ఉంటుందా? 
-కచ్చితంగా. వేదంలో సరోజ పాత్రకి కొనసాగింపుగా ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ ఆర్గానిక్ గా ఏదైనా ఒక కథ వస్తే బాగుంటుందని ఎదురు చూశాం. అలాంటి సమయంలో ఘాటి లాంటి అద్భుతమైన కథ కుదిరింది. క్రిష్ గారు నాకు ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందులో శీలావతి క్యారెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 
 
రిమోట్ ఏరియాలో కూడా మిమ్మల్ని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారని విన్నాం? 
-అభిమానులు, ప్రేక్షకులకి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. రాజమౌళి గారు లాంటి దర్శకులు బాహుబలి లాంటి చిత్రాలతో అద్భుతంగా ప్రజెంట్ చేయడం వలనే అన్ని వైపులా రీచ్ అయింది. ఒక మంచి చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుంది. ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నాను. అరుంధతి నుంచి ఇప్పటివరకు నాకు ఎన్నో అద్భుతమైన పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 
 
ఘాటీ నిర్మాతల గురించి? 
-రాజీవ్ రెడ్డి గారికి, యువి క్రియేషన్స్ కి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ని బిలీవ్ చేసి నాపై నమ్మకం ఉంచి ఇంత గ్రాండ్ స్కేల్లో సినిమా చేసినందుకు వారికి కృతజ్ఞతలు. వారితో జర్నీ ఎప్పుడూ అద్భుతంగానే వుంటుంది.  
 
ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది? 
-నేను చేసిన చాలా సినిమాలు హార్డ్ వర్క్ తో కూడుకున్నవే. ఘాటిలో కూడా ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది. అయితే ఇలాంటి కొత్త లొకేషన్స్ లో షూట్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అయితే క్రిష్ గారు షూటింగ్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. అలాంటి కొత్త లొకేషన్స్ షూట్ చేయడం మెమరబుల్ ఎక్స్ పీరియన్స్.   
 
విక్రమ్ ప్రభు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? 
-విక్రమ్ ప్రభు గారు నాకు ముందు నుంచే తెలుసు. ఆయన కుమ్కి సినిమా నాకు చాలా ఇష్టం. విక్రమ్ గారు వెరీ నైస్ జెంటిల్మెన్. దేశిరాజు క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్.  
 
డి ఓ పి మనోజ్ గురించి? 
-మనోజ్ కెమెరా వర్క్, సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో మ్యూజిక్ ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది. క్రిష్ గారు ఈ సినిమా కోసం మూడు పాటలు రాశారు. అందులో కుందేటి చుక్క అని ఆయన చేసిన పదప్రయోగం నాకు చాలా ఇష్టం. ఆయన చిన్నచిన్న మాటలతో కథలో గొప్ప డెప్త్ ని తీసుకొస్తారు. 
 
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. బయట కూడా ఎక్కువగా కనిపించరు. మీ లిజర్ టైం లో ఏం చేస్తుంటారు? 
-నేను చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తాను. చదువుతాను. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను. మూవీస్ కూడా చూస్తాను. గత రెండేళ్లుగా ఎక్కువగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాను. 
 
మీరు ఇంకా చేయాలనుకునే క్యారెక్టర్ ఏదైనా ఉందా? 
-అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఒక బలమైన క్యారెక్టర్ కుదిరితే కచ్చితంగా నెగిటివ్ రోల్ చేస్తాను. 
 
కొత్తగా కథలు వింటున్నారా? 
-వింటున్నాను. మంచి లైన్ అప్ ఉంది. మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాను. అది నా ఫస్ట్ మలయాళం ఫిల్మ్. తెలుగులో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది