గురువారం, 13 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శనివారం, 8 నవంబరు 2025 (17:18 IST)

Satya: మత్తువదలరా కాంబినేషన్ మరోసారి, రియా సింఘా ఎంట్రీ

Rhea Singha, Satya, Ritesh Rana, Kala Bhairava
Rhea Singha, Satya, Ritesh Rana, Kala Bhairava
మత్తువదలరా కాంబినేషన్ మరోసారి అలరించబోతోంది. కల్ట్ హిట్ అయిన మత్తు వదలరాతో తో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత మరో బ్లాక్‌బస్టర్ సీక్వెల్ మత్తువదలరా 2 విజయాన్ని అందుకున్న రితేష్ రానా తన నాల్గవ డైరెక్షనల్ మూవీని ప్రకటించారు. యూనిక్ స్టయిల్ నరేషన్ తో ఆకట్టుకునే రితేష్ రానా మరోసారి సత్యతో జతకడుతున్నారు.

ఇది ప్రేక్షకులకు మరో నవ్వుల విందును అందిస్తుంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 4గా చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పాత్ర కథలో కీలకంగా వుంటుంది. సత్యతో ఆమె జంటగా కనిపించడం ప్రేక్షకులకు ఒక  ఫ్రెష్‌నెస్ ఇవ్వనుంది. మత్తు వదలరా ఫ్రాంచైజీలో భాగమైన వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
అఫీషియల్ గా చిత్రాన్ని ప్రకటిస్తూ, మేకర్స్ ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. మత్తువదలరా టీం మరోసారి ఒక్కటవడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. రితేష్ రాణా మార్క్ హ్యూమర్, క్రియేటివిటీతో కూడిన పూర్తి స్థాయి లాఫ్టర్ రయట్ కోసం సిద్ధమవుతున్నారు.
 
రితేష్ రానా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్.  
 
ఈ చిత్రం “వైల్డ్, విట్టీ రైడ్ విత్ అన్ ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్”గా ఉండబోతోంది.
 
డైరెక్టర్ రితేష్ రాణా మత్తు వదలరా యూనివర్స్ అభిమానులకు సిగ్నేచర్ ఎక్స్‌పీరియన్స్ – క్లెవర్ రైటింగ్, యూనిక్ క్యారెక్టర్స్, అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ తో రాబోతున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది