Vijay: నిజం బయటకువస్తుంది - త్వరలో బాధితులను కలుస్తానంటున్న విజయ్ (video)
తమిళనాడులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. ఆరోజు జరిగిన సంఘటన ఎంతో మథనపడ్డాను. ఎందుకిలా జరిగింది? అసలు నేను పార్టీపెట్టి ప్రజా సేవ చేయడం తప్పా? అనేలా ఆలోచించానని తన వీడియోలో పేర్కొన్నారు. తనపై ఎంత ప్రేమతో తన సభకు జనం తరలివచ్చారన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తానన్నారు విజయ్.
దీనిపై విశ్లేషకులు లోతుగా ఆలోచించారు. గతంలో కమల్ హాసన్ కానీ, రజనీకాంత్ కానీ మరికొందరు సినీ హీరోల అనుభవాలను తీసుకుంటే బాగుండేదని పేర్కొంటున్నారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎంత ఎదురీత ఈదారో తెలియంది కాదు. పాలక వర్గంతో ఢీ అంటే ఢీ అంటూ మాటకు మాటకు చేతకుచేత అంటూ సై అనేలా చేసినా ఆయన ఒక్కడి వల్లే రాజపీఠం సాధ్యం కాలేదు. అందుకు మరో తోడు కాావాలి.
విజయ్ కూడా మరో పార్టీతో అలవెన్స్ పెట్టుకుంటే బాగుండేదేమోనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా విజయ్‌కు ఇదొక కనువిప్పు లాంటి సంఘటన. భవిష్యత్‌లో ఆయన పార్టీ ద్వారా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటారో చూడాలని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.