1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 15 మే 2025 (16:37 IST)

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

Producer Ganapathi Reddy
Producer Ganapathi Reddy
ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయని అందుకే సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా ప్రేక్షకులు రావడంలేదని నిర్మాత గణపతి రెడ్డి వాపోయారు. అశ్విన్ బాబు హీరోగా  వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాను ఆయన నిర్మించారు. జులైలో సినిమాను విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న సినిమాలు అసలు బతకడంలేదనీ, అంతా ఓటీటీ మహత్యమేనని విమర్శించారు. ఈ సినిమా తీయడానికి బడ్జెట్ ఎక్కువయిందనీ, అయినా కథ పై నమ్మకంతో పెట్టుబడి పెట్టానని అన్నారు.
 
ఇంకా గణపతి రెడ్డి మాట్లాడుతూ..  అశ్విన్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. దర్శకుడు కృష్ణ విజువల్స్ టేకింగ్ అదరగొట్టారు. హరి గారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. చాలా మంచి టీంతో పని చేశాం. ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.    
 
ఇది వరకు థియేటర్ కు జనాలు ఏసి కోసం వచ్చేవారు. సినిమా ఎలా వున్నా థియేటర్ లోకి వచ్చి నిద్రపోవడానికే వచ్చేవారు. కానీ ఇప్పుడు అందరికీ ఏసి ఇండ్లలోనే వుంది. బహుశా అందుకే రాలేకపోతున్నారు. కనుక సినిమాలో వావ్ అనిపించేలా కథ వుంటేనే వస్తారు. అది మా సినిమాలో వుంటుంది అన్నారు.