శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (18:15 IST)

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతోకాలం బాధించింది, అందుకే కలి సినిమా చేశాం : ప్రిన్స్

Varuntej, naresh kali team
Varuntej, naresh kali team
ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా  వరుణ్ తేజ్ మాట్లాడుతూ,  ప్రిన్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్. డెడికేషన్ ఉన్న నటుడు. హీరోగా చేస్తూనే మంచి రోల్స్ వస్తే డీజే టిల్లు, స్కంధ లాంటి మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు.  అలాంటి క్యారెక్టర్స్ తో ప్రిన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. నా మూవీస్ లో కూడా ప్రిన్స్ నటించాడు. ప్రిన్స్ ఈ సినిమా గురించి నాకు చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు. మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. "కలి" సినిమాకు కూడా మన ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ, డైరెక్టర్ శివ శేషు, హీరోయిన్ నేహా మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
నటుడు మహేశ్ విట్ట మాట్లాడుతూ - "కలి" సినిమాలో బొద్దింక క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పాను. నాతో పాటు ప్రియదర్శి, అయ్యప్ప శర్మ గారు వాయిస్ ఇచ్చారు. మా ముగ్గురు వాయిస్ లు సినిమా అంతా ఉంటాయి. నాతో ఈ కొత్త అటెంప్ట్ చేయించిన దర్శకుడు శివ శేషుకు థ్యాంక్స్. అన్నారు
 
చిత్ర సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ-  ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాఢ్యం ఆత్మహత్యలు. ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచలను కొద్ది సేపు నియంత్రించుకుంటే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. ఈ పాయింట్ తో "కలి" సినిమాను నిర్మించాం. మా ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ ప్యాషనేట్ గా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ప్రిన్స్, నరేష్ చాలా బాగా నటించారు. ప్రిన్స్ సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. "కలి" సినిమాకు మీ అందరి సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
 
నిర్మాత లీలా గౌతమ్ వర్మ మాట్లాడుతూ - ఈ రోజు మా "కలి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వరుణ్ గారికి, అల్లరి నరేష్ గారికి, ప్రియదర్శి, బలగం వేణు గారికి, ఆకాష్ అన్నకు మిగతా గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మా మూవీ టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ అందించిన నాగ్ అశ్విన్ గారికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రభాస్ అన్నయ్యకు, ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్. మా "కలి" సినిమా ఈ నెల 4వ తేదీన థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
 
దర్శకుడు శివ శేషు మాట్లాడుతూ - "కలి" సినిమాలో ప్రిన్స్, నరేష్ నటన మీ అందరినీ ఆకట్టుకుంటుంది. మనం పడితే ఆ బాధ మనకు తెలుస్తుంది. మనం తిరిగి నిలబడి ఎదిగితే అది పదిమందికి తెలుస్తుంది. "కలి" సినిమా కాన్సెప్ట్ ఇదే. చిత్రీకరణలో మా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. మా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. మీరు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
 
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ - ప్రిన్స్ నాకు మంచి ఫ్రెండ్. "కలి" సినిమా గురించి ప్రిన్స్ నాకు చెప్పినప్పుడు నువ్వు బస్ స్టాప్, డీజే టిల్లు లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అన్నాను. సబ్జెక్ట్ చాలా బాగుందని ప్రిన్స్ అన్నాడు. ఆత్మహత్యలు వద్దని చెప్పే చిత్రమిది. మన దేశంలో కోవిడ్ తర్వాత ఆత్మహత్యలు పెరిగాయి. ఒక పర్పస్ ఉన్న మంచి సినిమా ఇది. ఈ చిత్రంలో బల్లి పాత్రకు వాయిస్ ఇచ్చా. "కలి" మూవీ మంచి హిట్ కావాలి. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
 
హీరో ప్రిన్స్ మాట్లాడుతూ, నేను ఇష్టపడే హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతోకాలం బాధించింది. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్, నా రూమ్మేట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు ఎంతో బాధపడ్డాను. ఈ ఆత్మహత్యల నివారణకు ఏదో ఒకటి నా వంతు ప్రయత్నంగా చేయాలని అనిపించింది. ఆ టైమ్ లో "కలి" కథ నా దగ్గరకు వచ్చింది. ఇది తప్పకుండా చేయాలని అనుకున్నా. "కలి" సినిమా మిమ్మల్ని బాధపెట్టేలా ఉండదు. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి మ్యూజిక్ ఉంటుంది. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి. మా డైరెక్టర్ శివ శేషు, ప్రొడ్యూసర్ గౌతమ్, ప్రెజెంటర్ రాఘవేంద్ర రెడ్డి గారికి థ్యాంక్స్. మా మూవీకి జె.బి గారి మ్యూజిక్ ఆకర్షణ అవుతుంది. "కలి" సినిమా చూసేందుకు ఈ నెల 4వ తేదీన థియేటర్ లో కలుద్దాం. అన్నారు.
 
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, ఆత్మహత్యలు వద్దనే ఒక మంచి కాన్సెప్ట్ తో "కలి" సినిమా మీ ముందుకు వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. ఈ టీమ్ లో డైరెక్టర్ శివ శేషు, ప్రొడ్యూసర్ లీలా గౌతమ్, డీవోపీ లు నిషాంత్, రమణ , హీరోయిన్ నేహా వీళ్లంతా కొత్తవాళ్లు. కొత్త వాళ్లకు తమ సినిమా రిలీజ్ అవుతుంటే ఎన్ని హోప్స్ ఉంటాయో నాకు తెలుసు. మీరంతా వాళ్లకు మొదటి సినిమాతోనే సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.